అక్టోబర్ నెల అయిపోయింది. నవంబర్ నెలలోకి అడుగు పెట్టేశాము. ఇక నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వచ్చేశాయి. మామూలుగా కొత్త నెల స్టార్ట్ కాగానే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అమలులోకి వస్తాయి. అదే విధంగా కొన్ని ఫైనాన్షియల్ రూల్స్ కూడా కొత్త నెల తొలి రోజు నుంచే అమలు చేస్తుంటారు. అదే క్రమంలో ఈ నవంబర్ నెల స్టార్ట్ అయ్యాక కొన్ని రూల్స్ అమలులోకి వచ్చేశాయి. ఈసారి కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. ఇవి మన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపవచ్చు. మరి ఆ రూల్స్ ఏంటి? వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎస్‌బీఐ కార్డ్స్ వాడే వారికి షాక్ అనే చెప్పాలి. ఇందుకు సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ అమలులోకి వచ్చాయి. క్రెడిట్ కార్డుల ద్వారా యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలు పెరిగాయి. నవంబర్ 1 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై ప్రతి నెలా ఫైనాన్స్ ఛార్జీగా 3.75 శాతం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అన్‌సెక్యూర్డ్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఫైనాన్స్ ఛార్జీలు నెలకు 3.75 శాతానికి పెరిగాయి. ఇక బిల్లింగ్ పిరియడ్‌లో యుటిలిటీ పేమెంట్స్ కనుక రూ.50,000 దాటితే 1 పర్సెంట్ ఎక్కువ ఛార్జ్ పడుతుంది. అయితే ఈ ఛార్జి వసూలు మాత్రం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక ఎలక్ట్రిసిటీ, వాటర్, ఎల్‌పీజీ గ్యాస్, వంటి యుటిలిటీ బిల్లుల పేమెంట్స్ రూ.50 వేల కంటే ఎక్కువ చెల్లిస్తే 1 పర్సెంట్ సర్ ఛార్జీ కట్టాల్సి ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫీజు విషయంలో, క్రెడిట్ కార్డ్ రివార్డ్ విషయంలో కొన్ని చేంజెస్ చేసింది. ఈ చేంజెస్ ఇన్సూరెన్స్, కిరాణా కొనుగోళ్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫ్యూఎల్ సర్‌ఛార్జ్ బెనిఫిట్స్, లేట్ పేమెంట్ ఫీజులు వంటి సర్వీసెస్ కి సంబంధించినవి. నవంబర్ 15 నుంచి ఈ ఛేంజెస్ అమల్లోకి వస్తాయి. ఇక స్పా బెనిఫిట్స్ నిలిపివేత, రూ.1,00,000 కంటే ఎక్కువ ఖర్చులకు ఫ్యూయల్ సర్‌ఛార్జ్ బెనిఫిట్ తీసి వేయడం, గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ పై రివార్డ్ పాయింట్‌లు తొలగింపుతో పాటు థర్డ్ పార్టీ మార్గాల ద్వారా ఎడ్యుకేషన్ ఫీజులు పే చేస్తే 1% ఛార్జీలు పెరుగుతాయి.
ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి చివరి తేదీ నవంబర్ 30, 2024గా ఉంది. ఇండియన్ బ్యాంక్ ‘ఇండ్ సూపర్ 300 డేస్’ స్పెషల్ ఎఫ్‌డీలో జనరల్ పబ్లిక్‌కు కూడా 7.05 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్లకు అయితే 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.80 శాతం వడ్డీ వస్తుంది. ఇక 400 రోజుల ఎఫ్‌డీపై జనరల్ పబ్లిక్‌కు 7.25 శాం, సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8 శాతం వడ్డీ రేట్లనేవీ అప్లై అవుతాయి. ఇక అలాగే అడ్వాన్స్ రైలు టికెట్ బుకింగ్ వ్యాలిడిటీని తగ్గిస్తున్నట్లు ఇండియన్ రైల్వే ఇంతకముందే ప్రకటించింది. గతంలో 120 రోజులు ఉండేది. కానీ ఇప్పుడు ఈ బుకింగ్ పీరియడ్‌ను 60 రోజులకు తగ్గించింది. దీంతో 2 నెలల ముందు మాత్రమే అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ కొత్త రూల్ నవంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం పడదు. వాళ్ళకు పాత రూలే అప్లై అవుతుంది.
ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 1 నుంచి డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్‌కు (DMT) సంబంధించి కొత్త రూల్‌ని పెట్టింది.అన్నీ ఫైనాన్సియల్ డిపార్ట్మెంట్స్, కంపెనీలు ఆర్థిక చట్టాలకు కచ్చితంగా కట్టుబడి ఉండాలి. డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ సేఫ్టీని పెంచేలా ఆర్బీఐ ఈ రూల్స్‌ను పెట్టింది. 24 జూలై 2024న విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం.. బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల అవైలబులిటీ మరింత పెరగుతుంది. అంతేకాదు మనీ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన పేమెంట్స్ సిస్టమ్స్ కూడా బాగా మెరుగవుతాయి. కేవైసీ పనులు మరింత ఈజీగా అవుతాయి.ప్రతి నెలా 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను మారుస్తూ ఉంటాయి. ఇక ఈ నవంబర్ 1న నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచింది. హైదరాబాద్‌లో రూ.855కు పెంచింది. అలాగే ఫేక్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే చాలా మంది సైబర్ మోసగాళ్లు ఫేక్ కాల్స్, మెసేజ్ ల ద్వారా ప్రజలను మోసం చేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.ఈ నవంబర్ 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించిన కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. మన ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లను టెలికాం ఆపరేటర్లు ముందే స్క్రీనింగ్ చేస్తారు. స్పామ్ కాల్‌లు, మెసేజీలు వెంటనే బ్లాక్ చేసేస్తారు. ఇదీ సంగతి. ఇవి నవంబర్ 1 నుంచి అమలయ్యే ముఖ్యమైన రూల్స్.