దీపావళికి టపాసుల్లా పేలిన మూవీస్

www.mannamweb.com


మూవీ లవర్స్ కు పండుగలు చాలా స్పెషల్. ఎందుకంటే ప్రతి పండుగకు ఎదో ఒక కొత్త మూవీ రిలీజ్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ ఏడాది తెలుగులో పెద్ద పెద్ద పండగలేవి ఆశించిన స్థాయిలో వినోదాన్ని అందించలేకపోయాయి. సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా.. వాటిలో హనుమాన్ బాగా ఆడింది. ఇక దసరాకు నాలుగు సినిమాలు రిలీజ్ కాగా ..వాటిలో ఒక్కటీ కూడా మెప్పించలేకపోయింది. కానీ దీపావళికి మాత్రం వచ్చిన ప్రతి మూవీ థౌసండ్ వాలా రేంజ్ లో భారీ రీసౌండ్ చేస్తున్నాయి. ఈ దీపావళికి తెలుగు నుంచి ‘లక్కీ భాస్కర్’.. ‘క’ లాంటి రెండు క్రేజి మూవీస్.. తమిళం నుంచి ‘అమరన్’, కన్నడ నుంచి ‘బఘీర’ రేసులో నిలిచాయి. సాధారణంగా ఒకేసారి మూడు నాలుగు చిత్రాలు రిలీజ్ అయితే.. వాటిలో ఎదో ఒకటి మాత్రమే ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ ఈసారి మాత్రం రేసులో పాల్గొన్న నాలుగు సినిమాలు విజయాన్ని సాధించాయని చెప్పి తీరాల్సిందే.

వాటిలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ గురించి.. సాధారణంగా ఏ హీరో అయినా హిట్ కొడితే ఆ హీరో అభిమానులు మాత్రమే హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్పొచ్చు . గత కొంత కాలంగా సక్సెస్ చూడని కిరణ్ అబ్బవరంకు .. ‘క’ సినిమా టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రీమియర్ , ఫస్ట్ షోస్ నుంచే పాజిటివ్ , హిట్ టాక్ సంపాదించుకుంది. ముఖ్యంగా మూవీ క్లైమాక్స్ లో లాస్ట్ 10 నిమిషాలు మాత్రం ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ , హీరో ఫ్లాష్ బ్యాక్ ప్రతి ఒక్కటి ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. కలెక్షన్స్ విషయం పక్కన పెట్టేస్తే..కథలో కంటెంట్ ఉన్న మూవీ ‘క’. ఓవరాల్ గా ఈ మూవీ ఒక డీసెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత లక్కీ భాస్కర్ మూవీ.. తెలుగులో దుల్కర్ సల్మాన్ తీసిన సినిమాలు తక్కువే. అయినా కూడా ఈ హీరోకు ఇక్కడ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. ఇప్పుడు అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. దానితో పాటు సినిమా థీమ్ అండ్ డిజైన్ , దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ అందరిని మెప్పించింది. ఈ మూవీ అంతా కూడా స్టాక్ మార్కెట్ అండ్ బ్యాంక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక సినిమాలో కూడా క్లైమాక్స్ ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫైనల్ గా దుల్కర్ సల్మాన్ గేమ్ అదరగొట్టేశాడని చెప్పొచ్చు.

ఈ రెండు కాకుండా తమిళం నుంచి రిలీజ్ అయిన తెలుగు వెర్షన్ మూవీ.. అమరన్. ఈ మూవీ రిలీజ్ కు ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ జర్నీకి అద్దం పట్టిన ఈ సినిమా.. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ , క్లైమాక్స్ అందరిని మరింత భావోద్వేగానికి గురి చేస్తాయని చెప్పి తీరాల్సిందే. ఇక సాయి పల్లవి , శివ కార్తికేయన్ తమ పాత్రలలో నటించారని చెప్పడం కంటే.. జీవించారని చెప్పొచ్చు. ఓ మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. ఇక కన్నడ నుంచి వచ్చిన సినిమా బఘీర. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో మాస్, యాక్షన్, థ్రిల్లర్‌, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మూవీ ఇది. క్లైమాక్స్ లో ఆఖరి 20 నిమిషాలు ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మాస్ ఆడియన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. కొన్ని సీన్స్ మాత్రం ప్రశాంత్ నీల్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తీసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక శ్రీమురళీ పెర్ఫార్మెన్స్, రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెసెన్స్ అందరిని మెప్పిస్తుంది. ఓవరాల్ ఈ మూవీ ఓ మంచి యాక్షన్ ఎంటర్టైనర్. ఇలా ఈ దీపావళికి వచ్చిన నాలుగు సినిమాలు కూడా ఒక దానితో ఒకటి కంపారిజన్ లేకుండా దేనికదే స్పెషల్ గా నిలిచాయి.