కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి 6 నెలలు బంద్.. కారణమిదే..

www.mannamweb.com


ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధామ్ కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి ఆరు నెలల బంద్ కానుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అయితే ఎందుకు ఆలయం క్లోజ్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

కేదార్‌నాథ్ ధామ్(Kedarnath temple) ఆలయ తలుపులు రేపు మూసివేయనున్నారు. అయితే శీతాకాలం వస్తున్న నేపథ్యంలో తగిన ఆచారాలతో బంద్ చేస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు భూకుంత్ భైరవనాథుని ఆశీస్సులు అందుకుంటారు. శతాబ్దాలుగా అనుసరిస్తున్న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మూసే ముందు ప్రత్యేక పూజలు చేస్తారు. భాయ్ దూజ్ పండుగ సోదర సోదరీమణుల మధ్య పవిత్ర సంబంధాన్ని సూచిస్తుంది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల నుదుటిపై తిలకం దీద్ది వారి దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.

కారణమిదే..

శీతాకాలం కారణంగా నిబంధనల ప్రకారం లార్డ్ కేదార్‌నాథ్ ద్వారపాలకుడైన భుకుంత్ భైరవనాథ్ ఆలయ తలుపులు ఆరు నెలల పాటు మూసివేస్తారు. శనివారం ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలో కేదార్‌బాబా పంచముఖి డోలీని ప్రతిష్టించనున్నారు. తదుపరి ఆరు నెలల పాటు, ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబా ఆరాధన, దర్శనం జరుగుతాయి. అదే సమయంలో బద్రీ-కేదార్ ఆలయ కమిటీ ఆలయ తలుపులు మూసివేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.

భాయ్ దూజ్ పండుగ

క్యాలెండర్ ఆధారంగా ఈ సంవత్సరం భాయ్ దూజ్ పండుగను నవంబర్ 3, 2024 ఆదివారం జరుపుకుంటారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం భాయ్ దూజ్‌ని యమ ద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజు యమరాజ్ తన సోదరి యమునాజీని కలవడానికి వచ్చారని చెబుతుంటారు. అప్పటి నుంచి ఈ పండుగను భాయ్ దూజ్‌గా జరుపుకుంటారు.

ఈ శుభ సమయంలో తిలకం పెట్టడం సోదరులకు అదృష్టాన్ని తెస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. భాయ్ దూజ్‌లో తిలకం వేయడానికి అనువైన సమయం నవంబర్ 3న ఆదివారం. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:51 నుంచి 5:43 వరకు, మధ్యాహ్నం ముహూర్తం: మధ్యాహ్నం 1:10 నుంచి 3:22 వరకు, విజయ ముహూర్తం: మధ్యాహ్నం 1:54 నుంచి 1:54 వరకు, తిలకం ప్రధాన శుభ సమయం: మధ్యాహ్నం 1:16 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఇందులో సోదరీమణులు తమ సోదరులకు తిలకాన్ని వేయవచ్చు.

ప్రత్యేక పూజలు

కేదార్‌నాథ్ ఆలయ పూజారి శివశంకర్ లింగ్‌తో పాటు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ, తీర్థ పురోహిత్ సమాజ్, పంచపాండ కమిటీ అధికారులు ఇప్పటికే భైరవనాథ్ ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత భుకుంత్ భైరవనాథ్ జలాభిషేకం తరువాత, అన్నదానం, ప్రార్థనలు సమర్పించి హవన యాగం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవంబరు 1న బాబా కేదార్‌నాథ్‌ ధామ్‌లో లక్ష్మీ పూజలతో పాటు దీపావళి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసారి కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకున్న యాత్రికుల సంఖ్య 15.5 లక్షలు దాటింది. ఈ రోజుల్లో దర్శనం కోసం ప్రతిరోజూ సుమారు 19 నుండి 20 వేల మంది భక్తులు కేదార్‌నాథ్ ధామ్‌ చేరుకున్నారు.