Heavy Rains Alert:రాష్ట్రంలో మరో అల్పపీడనం.. ఆ తేదీ నుంచి భారీ వర్షాలు

www.mannamweb.com


 

 రాష్ట్రాన్ని వానలు వీడడం లేదు. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల ఏపీలో భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో(నవంబర్) సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, రైతులను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.