నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం చోటుచేసుకుంది. రామాంజనేయులు అనే మోసగాడు క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లకు పైగా ప్రజల నుంచి వసూలు చేసి మోసం చేశాడు.
కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 300 పైగా బాధితులు ఉన్నారు. ఈ మోసగాన్ని 45 రోజులుగా డోన్ పోలీసులు విచారణ పేరుతో నిందితుడిని తమ అదుపులో ఉంచుకొని విచారణ చేసిన ఎలాంటి పురోగతి లేకపోవడంతో తాము పెట్టుబడులు పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయా లేదా అంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు.
రామాంజనేయులు డోన్‌లో 2021 నుండి కేవలం ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో ప్రజలకు పరిచయమై అందరిని నమ్మించిన కేటుగాడు, కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్ జిల్లాలోని 300 మందికి పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం. గతంలో అనంతపురంలో రూ.90 లక్షలకు పైగా ప్రజల నుండి వసూలు చేసి మోసం చేసినట్లు తెలుస్తుంది. మోసగాడు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలు వస్తున్నాయని లక్షకు నెలకు పదివేల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లిస్తానని నమ్మించి బాధితుల నుండి దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూలు చేశాడు.