ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పలు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతాయి. రూ.12వేల నుంచి రూ.35వేల వరకు వేతనాలు లభించే ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డిఆర్‌డిఎ – సీడాప్ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నవంబర్ 5వ తేదీ మంగళవారం విజయవాడ “ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నారు.
ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.12,000/- నుండి రూ.35,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
నవంబర్ 5 న నిర్వహించబోయే ఈ జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు వివరించారు.
ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు https://tinyurl.com/jobmela-vjdeast లింక్ నందు తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం జరిగే జాబ్ మేళాకు తమ రెజ్యూమె- బయోడేటా లతో పాటు ఆధార్, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 9347779032 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.