ప్యాసింజర్ రైళ్ల నుంచి లగ్జరీ రైళ్ల వరకు, దేశ రైల్వే వ్యవస్థలో ఉన్న అనేక రైళ్లు ప్రయాణీకులను ప్రతీ రోజూ తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అయితే ఇప్పుడు మేము చెప్పబోతున్న రైలులో మీరు ప్రయాణించాలంటే..
ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఆసియాలోనే అత్యంత ఖరీదైన రైలు ఇది. ఇందులో ప్రయాణీకులను రాజుల్లా చూసుకుంటారు. మరి టికెట్ ధర ఎంతో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. గురించి ఎప్పుడైనా విన్నారా. అందులో ప్రయాణించే ప్రయాణికులను రాజుల్లా చూసుకుంటారు. ఇది ఏ రైలు మరియు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోండి.
అదే మహారాజా ఎక్స్‌ప్రెస్.. 2010లో ప్రారంభించిన ఈ రైలు భారతదేశంలో అత్యంత ఖరీదైనది మాత్రమే కాదు.. ఆసియాలోనే అత్యంత ఖరీదైన రైలుగా కూడా పేరొందింది. ఈ లగ్జరీ రైలు ఫైవ్ స్టార్ హోటల్ లాంటి ప్రయాణాన్ని అందిస్తుంది. ఇందులోని ప్రయాణికులకు ఫైవ్ స్టార్ సర్వీస్ లభిస్తుంది. ఈ రైలులో ప్రయాణించాలంటే మీ జేబులోంచి వేలు కాదు లక్ష కాదు.. ఏకంగా రూ.20 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఏడు రోజుల పాటు సాగే ఈ రైలు ప్రయాణంలో ప్రయాణీకులు తాజ్ మహల్, ఖజురహో టెంపుల్, రణథంబోర్ లాంటి పర్యాటక ప్రదేశాలను చూడొచ్చు.
ఫతేపూర్ సిక్రి, వారణాసి లాంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ఖరీదైన రైలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రతి కోచ్‌లో బాత్రూమ్లు, రెండు మాస్టర్ బెడ్రూమ్లు ఉంటాయి. అలాగే ప్రయాణికుల కోసం ప్రతి కోచ్‌లో మినీ బార్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా, లైవ్ టీవీ, ఎయిర్ కండీషనర్, ప్రకృతిని ఆస్వాదించేందుకు బిగ్ విండోలు ఉన్నాయి. మీరు మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు.