కేంద్రం గుడ్ న్యూస్.. భారత్ బ్రాండ్ బియ్యం కేజీ రూ. 34కే.. ఎక్కడ కొనాలంటే?

www.mannamweb.com


పేద, మధ్య తరగతి ప్రజలు మూడు పూటలా తినడానికి ఎంతో శ్రమించాల్సి వస్తుంది. పూట తిండి దొరక్క పస్తులుండే వారు ఎంతో మంది ఉన్నారు. చాలీ చాలనీ జీతాలతో కుటుంబమంతా కడుపునిండా తినలేని పరిస్థితి. నేటి రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొనబోతే కొరివి అన్నట్టుగా తయారయ్యింది. దేశంలో ఎక్కువ శాతం ప్రజలు ఆహారంగా రైస్ తీనే వారే ఎక్కువ. రైస్ తో రకరకాల వంటకాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. బియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితిదాపరించింది. వర్షాలు, చీడపీడల వల్ల ఆహార పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

దీనికి తోడు పంటలు సరిగా పండకపోవడంతో బియ్యం దిగుబడులు తగ్గి ధరలు పెరుగుతున్నాయి. వంట గ్యాస్, ఆయిల్, పప్పు దినుసులే కాదు బియ్యం ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. క్వాలిటీ బట్టి కేజీ రైస్ 50, 100 ఉంటుండడంతో కొనలేని పరిస్థితి దాపరించింది. మార్కెట్ లో బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేద వారికి చౌక ధరలో బియ్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన రైస్ అందించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోడీ ప్రభుత్వం భారత్ బ్రాండ్ రైస్ పేరిట తక్కువ ధరకే కేజీ రైస్ అందించేందుకు చర్యలు చేపట్టింది.

ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్తను అందించింది. తక్కువ ధరకే క్వాలిటీ రైస్ ను అందించేందుకు రెడీ అయ్యింది. భారత్ బ్రాండ్ సబ్సిడీ పథకంలో భాగంగా కేవలం రూ. 34కే భారత్ బ్రాండ్ బియ్యాన్ని అందించనున్నది. ఈ పథకం రెండో విడతలో భాగంగా బియ్యం, గోధుమ పిండి విక్రయాలను సెంట్రల్ గవర్నమెంట్ మంగళవారం ప్రారంభించింది. బియ్యాన్ని కేజీ రూ. 34కు, గోధుమ పిండిని రూ. 30కి విక్రయించాలని నిర్ణయించింది. ఇవి 5,10 కేజీల బ్యాగుల్లో అందుబాటులో ఉంటాయి. వీటిని నాఫెడ్, ఎన్ సీసీఎఫ్, కేంద్రీయ భాండార్, ఈ కామర్స్ వేదికల్లో కొనుగోలు చేయొచ్చు.

ఈ విక్రయాల కోసం మొబైల్ వ్యాన్లను ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ప్రారంభించారు. గతంలో భారత్ బ్రాండ్ సబ్సిడీ పథకం ద్వారా కేజీ బియ్యం రూ. 29కి, గోధుమ పిండిని రూ. 27కు కేంద్రం విక్రయించిన విషయం తెలిసిందే. తక్కువ ధరకే బియ్యం లభిస్తుండడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనులు చేసుకునే వారికి, కార్మికులకు భారత్ బ్రాండ్ రైస్ భారత్ బ్రాండ్ సబ్సిడీ పథకం ప్రయోజనకరంగా ఉండనున్నది.