అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ చరిత్రాత్మక విజయం సాధించారని X లో ట్విట్ చేశారు.
తమ మైత్రి వల్ల భారత్-అమెరికా బంధం బలోపేతం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజల జీవితాలు మెరుగుపరుద్దమని, ప్రపంచ శాంతి, సుస్థితర, శ్రేయస్సు కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయ దుందుభి మోగిస్తున్నారు. ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ 270 దాటేశాడు.. స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ సత్తా చాటారు. ఈ ఫలితాలపై ట్రంప్ కూడా స్పందించాడు. తన జీవితంలో ఇలాంటి క్షణం ఎప్పుడూ చూడలేదని, అమెరికా ప్రజల కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు. అమెరికా ప్రజలు ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. అమెరికాకు పూర్వవైభవం తెస్తానని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేస్తానని, తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందన్నారు.
స్వింగ్ రాష్ట్రాల్లో తాను ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెపుకొచ్చారు. తనకు 315కు పైగా ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తన విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సెనెట్‌తో పాటు కాంగ్రెస్‌లో కూడా తమకే ఆధిక్యమని ఉందన్నారు. కొత్త చట్టాలను తీసుకురావడానికి తమకు ఇబ్బందులు లేవని, అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తామని చెప్పారు. అసాధ్యాన్ని అమెరికా ప్రజలు సుసాధ్యం చేశారన్నారు. ఎవరైనా చట్టబద్ధంగానే దేశంలోకి రావాలని, సరిహద్దులను నిర్ణయిస్తామన్నారు. మస్క్ సహా తన విజయం కోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. తన విజయంలో ఎలాన్ మస్క్‌దే కీలకపాత్ర ఉందని, అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్ ఎలాన్ మస్క్ అని కొనియాడారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ తనకు సరైన ఛాయిస్ అని చెప్పుకొచ్చారు.