వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. దీని ఉపయోగం ఏంటంటే.

www.mannamweb.com


ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తూ వస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. సెర్చ్‌ ఆన్‌ వెబ్‌ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు.

ఇంతకీ ఈ ఫీచర్‌ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా వాట్సాప్‌లో ఏదైనా ఫొటోను పంపాలనుకుంటే గూగుల్‌ లేదా మరే ఇతర సెర్చ్‌ ఇంజన్‌లో అయినా వెతుక్కొని డౌల్‌లోడ్‌ చేసుకొని పంపిస్తుంటారు. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

సెర్చ్‌ ఆన్‌ వెబ్‌ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్లు ఇతర బ్రౌజర్‌లోక వెళ్లకుండానే వాట్సాప్‌లో ఇమేజెస్‌ను సెర్చ్‌ చేసుకోవచ్చు.

వాట్సాప్‌ చాట్‌ ఓపెన్‌ చేయగానే పైన రైట్‌ సైడ్‌లో కనిపించే త్రీ డాట్స్‌ను క్లిక్‌ చేయాలి. దానిపై క్లిక్‌ చేయగానే సెర్చ్‌ ఆన్‌ వెబ్‌ ఆనే ఆప్షన్‌ కనిపిస్తుంది. మీరు ఎలాంటి ఫొటో కావాలనుకుంటున్నారో ఎంటర్ చేస్తే ఫొటోలు వచ్చేస్తాయి.

ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు వాట్సాప్‌ ఇటీవల పలు ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.