తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఫోన్‌లు తీసుకొచ్చే వాటిలో ఐటెల్ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి ఐటెల్ రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది.
ఐటెల్ ఎస్25, ఐటెల్ ఎస్ 25 అల్ట్రా పేర్లతో ఈ రెండు ఫోన్‌లను మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఇంతకి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐటెల్ ఎస్25, ఐటెల్ ఎస్25 అల్ట్రా రెండు ఫోన్‌లు కూడా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్టాండర్డ్ మోడల్‌ను తీసుకొచ్చింది. అయితే అల్ట్రా వేరియంట్‌లో కూడా సేమ్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఈ రెండు ఫోన్‌లలో గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో తీసుకొచ్చారు. ఇక ఎస్25 అల్ట్రా యూనిసోక్ టీ620 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ రెండు స్మార్ట్ ఫోన్‌లలోనూ 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
ఇక ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌లో ఐటెల్ S25 డస్ట్, స్ప్లాష్ ప్రొటెక్షన్‌తో IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. అయితే ఐటెల్ S25 అల్ట్రా కొంచెం మెరుగైన IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ పరంగా ఈ రెండు ఫోన్‌లలో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌లను స్మార్ట్‌ఫోన్ బ్రోమో బ్లాక్, మంబో మింట్, సహారా గ్లామ్ కలర్స్‌లో తీసుకొచ్చారు.
ధర విషయానికొస్తే ఐటెల్ ఎస్25 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ వేరియంట్ ధర రూ. 8400 కాగా ఐటెల్ అల్ట్రా ధర రూ. 10,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ మొదలయ్యాయి. ఫిలిప్పీన్స్‌లోని కస్టమర్‌లు Shopee ద్వారా ఐటెల్ S25ని ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. మరోవైపు ఐటెల్ S25 అల్ట్రా ప్రీ-ఆర్డర్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి.