షర్మిలకు అండగా ఏపీ డిప్యూటీ సీఎం.. వారిపై చిన్న గాటు పడిన ఊరుకోం

www.mannamweb.com


తమది మంచి ప్రభుత్వమే కాని మెతక ప్రభుత్వం కాదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఐఏఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు.

షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని చెప్పారు. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అధికారుల మీద చిన్న గాటు పడిన చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. వైసీపీ ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. గంజాయి మన్యంతో పాటు రెవిన్యూ భూముల్లో కూడా సాగుచేస్తున్నారని, గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఏలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రఖ్యాత శాస్త్రవేత్త దివంగత డా. యల్లాప్రగడ సుబ్బరావు పేరును ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. డా.యల్లాప్రగడ పేరు ప్రతిపాదించగానే ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లు సానుకూలంగా స్పందించి పేరు ఖరారు చేసినందుకు పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు. క్యాన్సర్‌, ఫైలేరియా, క్షయ వ్యాధుల నివారణకు సంబంధించిన ఔషధాలతో పాటు తొలి టెట్రానెక్లిన్ యాంటీ బయాటిక్ ఆవిష్కరణలతో డా. యల్లాప్రగడ ఖ్యాతి పొందినట్లు చెప్పారు. ఆయన సేవలను, మేలునీ తమ కూటమి ప్రభుత్వం చిరస్మరణీయం చేసిందన్నారు. వర్తమాన, భావితరాలు ఆయన చేసిన పరిశోధనలు, ఆవిష్కరణలు స్పూర్తి పొందుతాయని తెలిపారు. అటవీ అధికారులకు అడవులను రక్షించేందుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆటవీ శాఖకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, వివిధ వర్గాల నుంచి అటవీ శాఖకు రూ.5 కోట్ల విరాళం సేకరించి ఇస్తానని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అడవులను కాపాడేందుకు ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా తాను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.