దోమలు ఏ సీజన్‌లో ఎప్పుడు, ఇంట్లోకి ఎలా వస్తాయో తెలియదు. ముఖ్యంగా వానా కాలం, శీతా కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. సాయంత్రమైతే చాలు.. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి చికాకు పెడతాయి. రాత్రిళ్లు నిద్ర లేకుండా చేస్తాయి. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కువ మంది మరణిస్తుంది దోమ కాటు వల్లే అని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ చిన్న జీవి చాలా డేంజర్. దోమల వల్ల ఆరోగ్యానికి ముప్పు ఎక్కువ. డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు దోమల కాటు వల్లే వస్తాయి. ఇవి, ఇంట్లోకి వచ్చాయంటే కుట్టకుండా ఏ మాత్రం వదలవు.
ఇక, దోమల్ని వదిలించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దోమల్ని చంపడానికి మార్కెట్‌లో దొరికే ప్రొడక్స్ వాడుతుంటాం. ఇవి, దోమల్ని చంపుతాయి. అయితే, కొన్ని సార్లు వీటిలో ఉండే రసాయనాల వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. గట్టి రసాయనాలు ఉండే ఈ ఉత్పత్తుల్ని పిల్లలు ఉంటే జాగ్రత్తగా వాడాలి. వాళ్లకు దూరంగా ఉంచాలి. పొరపాటున వాళ్ల చేతుల్లో పడితే డేంజర్. అందుకే ఓ అద్భుత చిట్కా మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ చిట్కాతో దోమల పని పట్టొచ్చు. రోజూ మనం తినే అరటి పండుతో దోమల్ని తరిమికొట్టవచ్చు. ఎలాగో చుద్దాం.
అరటి తొక్కతో దోమల్ని తరిమికొట్టండి..
అరటి తొక్క దోమలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని కోసం మీరు పెద్ద కష్టపడాల్సిన పనిలేదు. అరటిపండు తొక్కలను గదిలోని నాలుగు మూలల్లో, నిద్రించడానికి గంట ముందు ఉంచండి. అరటి తొక్కల నుంచి వెలువడే ఘాటైన వాసన దోమలను తరిమికొట్టడానికి పని చేస్తుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే లేదా ఎవరైనా శ్వాసకోశ సమస్యలు లేదా ఆస్తమాతో బాధపడుతున్నట్లయితే.. రసాయన ప్రొడక్ట్స్ వాడే బదులు.. ఈ చిన్న చిట్కాను ట్రై చేయండి.
దోమల్ని తరిమికొట్టే మొక్కలు..
అరటిపండు తొక్క పేస్ట్‌తో దోమలకు చెక్..
ఇంట్లో ఏ ప్రాంతాల్లో అయితే దోమల బెడద ఎక్కువగా ఉంటుందో.. అక్కడి నుంచి వాటిని తరిమికొట్టడానికి అరటి పండు తొక్కల పేస్టుని వాడవచ్చు. ఇందుకోసం అరటి పండు పై తొక్క తీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందుకోసం కొంచెం నీరు కూడా వాడుకోవచ్చు. ఈ పేస్టుని దోమలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలు, ఇంటి మూలాల్లో బాగా అప్లై చేయండి. ఈ పేస్టు నుంచి వచ్చే వాసనతో అవి ఇంటి నుంచి పారిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
అరటి తొక్కను కాల్చితే దోమలు పరార్..
దోమల సమస్యను త్వరగా వదిలించుకోవడానికి, అరటి తొక్కను కాల్చవచ్చు. నిజానికి, అరటి తొక్కను కాల్చినప్పుడు, దాని నుండి వెలువడే వాసన చాలా వింతగా ఉంటుంది. దీని కారణంగా దోమలు ఇంట్లోకి రావడానికి జంకుతాయి. అయితే అరటి తొక్కలను కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మేలు. దాని వింత వాసన అస్సలు బాగోదు.. కాబట్టి కొద్దిసేపు మాత్రమే గదిలో ఉంచండి. ఎక్కువ సేపు ఉంచితే మీకు ఇబ్బంది కలగవచ్చు.
వీటిని కూడా ట్రై చేయొచ్చు..
కర్పూరం..
దోమల్ని తరిమికొట్టడానికి కర్పూరాన్ని వాడుకోవచ్చు. కర్పూరం వాసన ఘాటుగా ఉంటుంది. ఇందుకోసం కర్పూరాన్ని గ్లాసులో నీటిలో వేయండి. నీటిలో కరిగిన తర్వాత ఓ స్ప్రే బాటిల్‌లో తీసుకుని.. ఇంటి మూలాల్లో, ఎంట్రీల్లో పిచికారీ చేయండి. కర్పూరం ఘాటైన వాసన దోమలకు పడదు. దీంతో… అవి ఇంట్లోకి రావడానికి భయపడతాయి. కర్పూరాన్ని వెలిగించి.. ఆ పొగను.. ఇంటి మొత్తం వ్యాపించేలా చేసిన ఫలితం ఉంటుంది.
యూకలిప్టస్ ఆకులు..
యూకలిప్టస్ ఆకుల్ని ఆయుర్వేదంలో బాగా వాడతారు. ఈ ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక, దోమల్ని తరమికొట్టడానికి యూకలిప్టస్ ఆకుల్ని ఎండబెట్టండి. ఆ తర్వాత వీటిని కాల్చాలి. ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయాలి. దీంతో.. దోమల బెడద తప్పుతుంది. ఈ చిట్కా పాటించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారు ఇంట్లో ఉన్నప్పుడు ఈ చిట్కా అమలు చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.