Viral Video: వామ్మో.. పెద్ద పులితో ఆటలా? పులి తరుముతుంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

www.mannamweb.com


చాలా మంది కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి వాటిని పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. వాటితో సరదాగా ఆడుకుంటుంటారు. అయితే దుబాయ్‌ (Dubai)లో ఇందుకు భిన్నం.
వారు వన్య మృగాలను పెంచుకోవడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. ఆ సంపన్న దేశంలో ధనవంతులు చిరుతలను, పులులను, సింహాలను ఇళ్లలో పెంచుకుంటారు. అంతేకాదు వాటిని తీసుకుని అప్పుడప్పుడు రోడ్ల పైకి కూడా వస్తుంటారు. వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు (Tiger Videos).

తాజాగా అలాంటి వీడియో ఒకటి billionaire_life.styles అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ విలాసవంతమైన ఇంట్లో ఓ వ్యక్తి తన పెంపుడు పులితో (Pet Tiger) ఆడుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఇల్లంతా పరిగెడుతుండగా ఓ పెద్ద పులి అతడిని పట్టుకునేందుకు అతడి వెంట పరుగులు తీస్తోంది. పరుగెత్తే క్రమంలో అతడు అదుపుతప్పి కింద పడిపోయాడు. అయినా సరే ఆ పులి అతడిని వదలలేదు. వెంబడించి అతడిని పట్టుకుంది. అయితే పెంపుడు పులి కావడంతో అతడిని ఏమీ చేయలేదు (Tiger Chasing Man).

ఈ వీడియో చాలా మంది నెటిజన్లను భయాందోళనలకు గురి చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. “మిడిల్ ఈస్ట్‌లో మాత్రమే ఇలాంటివి సాధ్యం,ఆ జంతువు బొమ్మ కాదు దానికి స్వేచ్చ కావాలి,వీడియో చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది,వన్య ప్రాణులను అలా బంధించడం ప్రకృతికి ఎదురెళ్లడమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.