అమరావతిలో నేడు (మంగళవారం) కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. NDA, LP సమావేవంలో అసెంబ్లీ చర్చల్లో భాగస్వామ్యంపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు.
శాసనసభ సమావేశాలరు హాజరు రాకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. దానికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలనేదానికీ కౌంటర్ వ్యూహం రెడీ చేసుకుంటున్నారు కూటమి నేతలు. అలాగే.. ఈ సెషన్లో ప్రవేశపెట్టబోతున్న కీలక బిల్లులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆమోదంపైనా శాసనసభాపక్ష భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. బడ్జెట్, శాసనసభా వ్యవహారాలపై ట్రెయినింగ్ ఇవ్వనున్నారు. తొలిసారి 84 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, రెండోసారి ఎన్నికైన 39 మంది ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు. అయ్యన్న నేతృత్వంలో అవగాహన తరగతులను నిర్వహించనున్నారు. అసెంబ్లీ సెషన్స్, బడ్జెట్‌పై సమగ్ర శిక్షణ అందించనున్నారు.
ఇక అసెంబ్లీ, కౌన్సిల్ చీఫ్ విప్, విప్ల నియామకంపై కసరత్తు మొదలు పెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. అసెంబ్లీ చీఫ్ విప్‌లుగా దూళిపాళ్ల, జీవీ ఆంజనేయులు, కూన రవి, బెందాళం అశోక్ పేర్లను పరిశీలిస్తోంది. విప్‌లుగా జనసేన నుంచి బొమ్మిడి నాయగర్, ఆరవ శ్రీధర్, బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లను పరిశీలిస్తున్నారు. మండలి చీఫ్ విప్ రేసులో పంచిమర్తి అనురాధ, రాంగోపాల్‌రెడ్డి ఉండనున్నట్లు సమాచారం. ఇక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోసం కాల్వ శ్రీనివాసులు పేరును పరిశీలిస్తున్నారు. మంగళవారం ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు బిజీబిజీగా గడపనున్నారు.