పిచ్చి కామెంట్లు.. రోత రాతలు.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడితూ ఇన్నాళ్లు పైశాచికానందం పొందిన వాళ్ల తాటతీస్తున్నారు ఏపీ పోలీసులు. వర్రా రవీందర్ అండ్ కో అరెస్ట్‌తో.. విస్తుపోయే నిజాలు బయటికొస్తున్నాయి. ఇంతకీ ఆ గ్యాంగ్ వెనుక కథ స్క్రీన్ ప్లే ఎవరిదన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్న ఏపీ పోలీసులు.. అరెస్ట్‌లతో హీటెక్కిస్తున్నారు. అసభ్యకర పోస్టుల కేసులో వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్‌లను మార్కాపురం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో కీలక విషయాలు బయటికొచ్చాయన్నారు కర్నూల్ రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్. వర్రా రవీంద్ర 2019 నుంచి వైసీపీ సోషల్ మీడియా కార్తకర్తగా పనిచేస్తున్నాడు. 2020లో ఏపీ డీజిటల్ కార్పొరేషన్, సోషల్ మీడియా కార్పొరేషన్‌లో పనిచేశాడు. మొత్తం 130మందితో యాక్టివిటీ నడిపేవాడు రవీంద్ర. కొంతమంది నేతల పీఏలు ఇచ్చే కంటెంట్‌తో పోస్టులు పెట్టేవాడు. తమ అధినేతను విమర్శించిన వాళ్లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి పైశాచికానందం పొందేవాడు నర్రా రవీందర్. సీఎం చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, అనితతో పాటు ఏపీసీసీ చీఫ్ షర్మిలపైనా అసభ్యకర పోస్టులు పెట్టాడు. న్యాయమూర్తుల విషయంలోనూ తమ పైత్యాన్ని చాటారు. నాయకుల ఫోటోలు మార్ఫింగ్ చేసి అడ్డమైన రాతలు రాశారు. సోషల్ మీడియాలో 40హ్యాండిల్స్‌లో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, వీడియోలు పోస్టులు చేసినట్టు నిందితులు విచారణలో అంగీకరించారన్నారు డీఐజీ కోయా ప్రవీణ్. కొన్నిసార్లు ఒవేరేవాళ్ల ఐడీలతోనూ కంటెంట్ పెట్టినట్టు గుర్తించామన్నారు.
ముగ్గురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేపడతామన్నారు పోలీసులు. వీళ్లు పెట్టిన పోస్టులు చదవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నాయని.. ఇదే పని అరబ్ దేశాల్లో చేస్తే బహిరంగ శిక్షలు ఉండేవని గుర్తుచేస్తున్నారు. వర్రాపై రాష్ట్రవ్యాప్తంగా 30 కేసులు నమోదయ్యాయి. ఎన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్టులు పెట్టారు..? ఏయే నేతల ఫోటోలు మార్ఫింగ్ చేశారు..? ఈ మొత్తం వ్యవహారం ఎవరి కనుసన్నల్లో జరిగిందన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. విచారణలో వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా మరిన్ని అరెస్ట్‌లు జరుగుతాయన్న ప్రచారం నడుస్తోంది.