భారత్‌లో నిత్యం రైళ్లలో కోట్లాది మంది ప్రయాణం చేస్తుంటారు. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. ఆధ్యాత్మిక ప్రదేశాలు, తీర్థయాత్రలకు వెళ్లాలన్నా రైలు ప్రయాణం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బస్సుల్లో ఎక్కువ సేపు ప్రయాణం చేసేందుకు ఇష్టపడని వారు కూడా ట్రైన్ జర్నీ పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇందులో కూడా రద్దీ తీవ్రంగా ఉంటుంది. అందుకే చాలా మంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. దీనిని రిజర్వేషన్ అని చెప్పొచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక వెబ్‌సైట్ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. ఇలా ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలుంటుంది. లేకుంటే గంటలకు గంటలు నిల్చొని ఉండాల్సి వస్తుంది.
కొన్ని సార్లు మన ప్రయాణాలు వాయిదా పడొచ్చు. దీనికి కారణం ఏదైనా కావొచ్చు. ముందుగా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. క్యాన్సిల్ చేసిన టికెట్లపై ఐఆర్‌సీటీసీ రీఫండ్ ఇస్తుంది. అయితే ఇది పూర్తి మొత్తం రాదన్న విషయం తెలిసిందే. మీరు రిజర్వేషన్ చేసుకున్నప్పుడు చెల్లించిన దాని కంటే తక్కువే అందుతుంది. అయితే.. ఎలాంటి వాటిపై రైల్వే శాఖ ఛార్జీల్ని రీఫండ్ చేయదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మేరకు ఈ ఛార్జీల గురించి స్పష్టత ఇచ్చారు రైల్వే బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ దిలీప్ కుమార్. ఇందులో ట్రైన్ ఫేర్‌కు అదనంగా రిజర్వేషన్ ఛార్జీ, సూపర్‌ఫాస్ట్ ఛార్జీ, జీఎస్టీ వంటివి కలిపే ఉంటాయని అన్నారు. ఇక టికెట్ క్యాన్సిల్ చేస్తే కేవలం ట్రైన్ ఫేర్ మాత్రం రీఫండ్ రూపంలో వస్తుందని తెలిపారు. ఇక రిజర్వేషన్ ఛార్జీలు, జీఎస్టీ నాన్ రీఫండబుల్ అని వివరించారు.
భారతీయ రైల్వే వ్యవస్థలో రెండు రకాల ట్రైన్స్ ఉన్నాయి. ఒకటి సూపర్‌ఫాస్ట్, రెండోది ప్యాసింజర్ అండ్ లోకల్ ట్రైన్స్. దూరప్రాంతాలకు రిజర్వేషన్స్ కోసం అయితే సూపర్‌ఫాస్ట్, తక్కువ దూరం ఉండి ప్రతి స్టేషన్లో ఆగుతుంటే వాటిని ప్యాసింజర్ ట్రైన్స్ అంటారు. వీటిల్లో రిజర్వేషన్లపై సూపర్‌ఫాస్ట్ ఛార్జీలు ఉండవు.
మీరు ప్రయాణించే తరగతిని బట్టి రిజర్వేషన్ ఛార్జీలు మారుతుంటాయి. వీటిపై రీఫండ్ రాదు. సెకండ్ క్లాస్ టికెట్లపై రిజర్వేషన్ ఛార్జీ రూ. 15 గా ఉంటుంది. స్లీపర్ కోచ్‌లో రూ. 20, ఏసీ ఛెయిర్ కార్, ఏసీ ఎకానమీ, థర్డ్ ఏసీకి అయితే రూ. 40 పడుతుంది. ఏసీ సెకండ్ క్లాస్ కోసం రూ. 50, ఏసీ ఫస్ట్ కోసం రూ. 60 రిజర్వేషన్ ఫీజుగా చెల్లించాలి. ఇవి సహా వీటిపై జీఎస్టీపైనా రీఫండ్ తిరిగి పొందలేరు.