తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 13న తిరుపతి సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు 13వ తేదీ రాత్రి 8:15 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లె, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుందని చెప్పారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
మరోవైపు ప్రయాణికుల రద్దీతో మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 12 నుంచి 24 వరకు రాయలసీమ జిల్లాల మీదుగా ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలులో ఆగుతాయి. నవంబర్ 12, 19 తేదీల్లో బెంగళూరు (ఎస్ఎంవీటీ)-బరౌని స్పెషల్ (06563) రైలు రాత్రి 9.15 గంటలకు బెంగళూరులో బయల్దేరి మరుసటి రోజు రాత్రి 8 గంటలకు బరౌనికి వెళుతుంది. ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలులో ఆగుతుంది. ఆ తర్వాత మహబూబ్‌నగర్, కాచిగూడ, కాజీపేట మీదుగా బరౌని చేరుకుంటుంది. ఈ రైలు (బరౌని-ఎస్ఎంవీటీ బెంగళూరు 06564) తిరుగు ప్రయాణంలో నవంబర్ 15, 22 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు బరౌనీలో బయల్దేరి.. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరు చేరుకుంటుంది.
నవంబర్ 13న యశ్వంతపూర్-ముజఫర్‌పూర్ స్పెషల్ (06229) స్పెషల్ రైలు ఉదయం 7.30 గంటలకు యశ్వంతపూర్‌లో బయల్దేరి.. రెండో రోజు ఉదయం 9.45 గంటలకు ముజఫర్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు సిటీ, మహబూబ్‌నగర్, కాచిగూడ, కాజీపేట మీదుగా వెళుతుంది. ఈ రైలు (ముజఫర్‌పూర్-యశ్వంతపూర్ 06230) తిరుగు ప్రయాణంలో 16న ఉదయం 10.45 గంటలకు ముజఫర్‌పూర్‌లో బయల్దేరి.. రెండో రోజు ఉదయం 10.30 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది.
నవంబర్ 14, 21 తేదీల్ యశ్వంతపూర్-దానాపూర్ (06271) ప్రత్యేక రైలు ఉదయం 7.30 గంటలకు యశ్వంతపూర్‌లో బయల్దేరి.. రెండో రోజు ఉదయం 6 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుంది. ఈ రైలు ధర్మవరం, డోన్, కర్నూలు సిటీ, మహబూబ్‌నగర్, కాచిగూడ, కాజీపేట మీదుగా వెళుతుంది. ఈ రైలు (దానాపూర్-యశ్వంతపూర్ స్పెషల్ 06272) తిరుగు ప్రయాణంలో.. 17, 24 తేదీల్లో ఉదయం 8 గంటలకు దానాపూర్‌లో బయలుదేరి.. రెండో రోజు ఉదయం 10.30 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.