ఎక్కడైనా లాభదాయకంగా జరిగే వ్యాపారాలు కొన్ని ఉంటాయి. వాటిలో మెడికల్ షాపు ఒకటి. అందులోనూ జనరిక్ మెడికల్ షాపులకు ప్రజల ఆదరణ చాలా బాగుంటుంది. సాధరణ దుకాణాలతో పోల్చితే ఇక్కడ మెడిసిన్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి.
అందుకే ప్రజలు జనరిక్ మెడికల్ షాపులను వెతుక్కుంటూ వస్తారు. ఈ నేపథ్యంలో జనరిక్ మెడిసిన్ వ్యాపారం చేయాలనుకునే వారికి దవా ఇండియా మంచి అవకాశం కల్పిస్తోంది. దవా ఇండియా జనరిక్ ఫార్మసీ కంపెనీని దేశంలో 2017లో ప్రారంభించారు. జనరిక్ ఔషధాలు, ఆరోగ్య సంబంధ వాటిని ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది.
ఈ కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి ఆదరణ ఉంది. దవా ఇండియా తన స్టోర్లను దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దానిలో భాగంగా ప్రాంచైజీలను అత్యంత తక్కువ ధరలకే కేటాయిస్తోంది. జనరిక్ వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం. ఈ కంపెనీకి ఇప్పటికే దేశంలో 1261 కంటే ఎక్కువ స్టోర్లు ఉన్నాయి. జనరిక్ ఔషధాలు, ఆరోగ్యం, ఓటీసీ, సౌందర్య సాధనాలు, న్యూట్రాస్యూటికల్స్, ప్రొటీన్ సప్లిమెంట్స్, ఆయుర్వేద ఉత్పత్తుల విభాగంలో దవా ఇండియా సేవలు అందిస్తోంది. ముఖ్యంగా జనరిక్ మెడిసిన్‌ను అత్యంత తక్కువ ధరకు అందించడం దీని ప్రధాన లక్ష్యం. మిగిలిన వాటితో పోల్చితే దవా ఇండియా ప్రాంచైజీలలో జనరిక్ మందుల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ధర తక్కువగా ఉంటే ప్రజల ఆదరణ బాగుంటుంది.
దవా ఇండియా ప్రాంచైజీ తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. ఈ కంపెనీ నుంచి దాదాపు 3 వేలకు పైగా ఉత్పత్తులు విడుదలవుతున్నాయి. తద్వారా కస్టమర్ల ఆదరణ పెరిగి అమ్మకాలు, లాభాలు బాగుంటాయి. ప్రాంచైజీ తీసుకున్న వారికి కంపెనీ అధిక లాభాల మార్జిన్ అందిస్తోంది. దాదాపు 25 శాతం తగ్గింపుతో పాటు కొన్నిసార్లు 10 శాతం అదనపు లాభం కూడా ఇస్తోంది. ప్రస్తుతం బయట మార్కెట్లో మెడిసిన్ ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో జనరిక్ షాపులపై ప్రజలు దృష్టి సారించారు. ఈ కంపెనీ ప్రాంచైజీని తీసుకోవడానికి సుమారు రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టాలి. వాటిలో రూ.1.50 లక్షలు వన్ టైమ్ ప్రాంచైజీ రుసుము. మిగిలిన డబ్బులను మీ షాపు లోపలి భాగాన్ని అభివృద్ధి చేయడానికి కంపెనీ ఖర్చుపెడుతుంది. దీనికి దరఖాస్తు చేసుకోవడం కూడా చాలా సులభం. దవాఇండియా.కమ్ అనే వెబ్ సైట్ కు వెళ్లాలి. అక్కడ ప్రాంచైజీ ఎంక్వైరీ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించిన ఫారంలో మీ వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. అనంతరం కంపెనీ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు