ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఆ ఇద్దరు మహిళ అపీసర్ల గురించే..! మాములుగా ఇద్దరు వేరు వేరుగా పోస్టింగ్‌లో ఉంటేనే వార్తల్లో ఉంటారు. అలాంటిది ఇద్దరు ఒకే పోస్టింగ్‌లో ఉంటే అసలు ఆ టాపిక్ ఇంకా జనాల నోళ్లలలో కిచిడి అయిపోదు..!
ఇప్పుడు అలానే ఉంది తెలుగు రాష్ట్రాల్లోని ఆ ఇద్దరు మహిళ సినియర్ ఐఏఎస్‌ల గురించి.. ఇంతకఈ ఏమైంది అనుకుంటున్నారా..!
స్మితా సబర్వాల్, అమ్రపాలి కాటా ఇద్దరు డైనమిక్ అఫీసర్లు.. ఎక్కడ పని చేసినా తమదైన స్టైల్ లో మార్క్ ను చూపించుకుంటున్నారు. ఎవరి స్టైల్ లో వాళ్లు దూసుకుపోయే వాళ్లే.. తెలంగాణలో ప్రదాన పోస్టుల్లో పని చేసిన వీరిద్దరికీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. స్మితా సబర్వాల్ 2001 ఆల్ ఇండియా సివిల్ సర్విసేస్ అధికారి. తెలంగాణ ఏర్పడక ముందు పలు జిల్లాలలో కలెక్టర్‌గా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. మెదక్ కలెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఆ తర్వాత సీఎం కేసిఆర్ తన టీంలోకి తీసుకోవడం, ఏకంగా సీఎం సెక్రటరీగా సుదీర్ఘ కాలం పని చేశారు స్మితా. పదేళ్ల పాటు ఆ పోస్ట్ లోనే ఉన్నారు. అయినా ప్రజల్లో తనకంటు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ రావడంతో తనకు అంతగా ప్రాధాన్యత లేని పైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ భాద్యతలు చూస్తున్నారు.
అమ్రపాలి సైతం తెలంగాణలో పనిచేశారు. ఆమె బాధ్యతలు నిర్వహించిన ప్రతి చోట తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కలెక్టర్ ఉండాగానే ట్రెక్కింగ్ వెళ్లడం, ట్రెండి థింగ్స్ తో ట్రెండింగ్ అపీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ ఆ తర్వాత కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ నుండి రీలివ్ అయి ఏపీలో జాయిన్ అయ్యారు అమ్రపాలి.
ఇప్పుడు ఆ ఇద్దరికి ఓకే పోస్టింగ్!
ఇద్దరికీ ఒకే పోస్టింగ్ ఏలా సాద్యమవుతుంది అని ఆలోచిస్తున్నారా అవును.. ఇద్దరు కూడ సోషల్ మీడియాలో, పబ్లిక్ లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్నావాళ్లే.. ఇద్దరికి సోషల్ మీడియాలో లక్షల్లో పాలోవర్స్ ఉన్నారు. ఏపీలో రిపోర్ట్ చేసిన అమ్రపాలికి టూరిజం ఎండీగా నియమించింది అక్కడి ప్రభుత్వం. సేమ్ టైంలో తాజా జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో స్మితా సబర్వాల్ కు టూరిజం సెక్రటరీగా భాద్యతలు అప్పజెప్పింది తెలంగాణ సర్కార్. దీంతో నిత్యం ప్రజల్లో, సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే ఇద్దరు అపీసర్లు సేమ్ భాద్యతలు ఇవ్వడం ఇప్పుడు హట్ టాఫిక్ గా మారింది. తమ ట్రెండీథింక్స్ తో టూరిజాన్ని మరింత పరుగులు పెట్టిస్తారని ఆందురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు డిస్కషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. టూరిజంలో ఇద్దరు మహిళ అధికారుల పాత్ర ఏలా ఉండబోతుంది అనే క్యూరియాసిటి మొదలైంది. చూడాలి మరీ ఆ ఇద్దరు ఎలా రాణిస్తారో..!