దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ఓ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతీ ఏటా అర్హులైన రైతులకు ఏటా రూ.
6 వేలు అందిస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి కేంద్రం రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు చొప్పును కేంద్ర డబ్బులు జమ చేస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా 19వ విడత పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే రైతులు ఒక విషయాన్ని గమించాల్సి ఉంటుంది. ఈ విడత రైతుల తమ ఖాతాల్లోకి డబ్బులు పడతనున్నాయి.? తాము లబ్ధి పొందుతున్నామా.? లేదా అన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది. రైతులు తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి. పీఎం కిసాన్ నిధులు జమ కావాలంటే రైతులుఈ-కేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్, ఆధార్ లింకింగ్ వంటి వాటిని కచ్చితంగా పూర్తి చేయాలని తెలిసిందే. ఇంతకీ రైతులు తమ స్టేస్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
* ఇందుకోసం ముందుగా రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
* అనంతరం అందులో కనిపించే ‘నో యువర్ స్టేటస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* వెంటనే మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
* అనంతరం స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. వెంటనే గెట్ డిటైల్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
* ఆ బటన్‌ను క్లిక్ చేయగానే మీ ప్రజెంట్ స్టేటస్ తెలుస్తుంది. అలాగే మీకు ఈ విడుత ప్రయోజనం లభిస్తుందో లేదో తెలిసిపోతుంది.