కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆన్ లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షలు ఆయా తేదీల్లో మొత్తం 13 భాషల్లో జరగనున్నాయి..
కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు (CRPF) అధికారిక ప్రకటన జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం కానిస్టేబుల్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఫిబ్రవరి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగున్నట్లు పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ పరీక్ష వచ్చే ఏడాది జనవరిలో జరగనున్నాయి. ఈ పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగుతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. రాతపరీక్ష అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, ఇంగ్లిష్/ హిందీ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ విధానం వర్తిస్తుంది.
కానిస్టేబుల్ పరీక్ష ‘కీ’లో తప్పులపై ఆధారాలు సమర్పించండి: అభ్యర్థులకు ఏపీ హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష విషయంలో ఏపీ పోలీసు నియామక బోర్డు విడుదల చేసిన తుది ‘కీ’లో తప్పులు దొర్లాయని కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిని విచారించిన కోర్టు తప్పులను నిరూపించేందుకు ఆధారాలను తమ ముందు ఉంచాలని అభ్యర్థులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది.