ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారు అలా చేయవచ్చు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రధానంగా పదో తరగతి పరీక్షలను విద్యార్థులు తెలుగు కూడా రాసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేసేటప్పుడు ఇంగ్లీషు/తెలుగు మీడియంను ఎంపిక చేసుకోవాలని ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు ఆప్సన్ ను మార్చుకోవచ్చని తెలిపింది. ఈ ఒక్క ఏడాదికే ఇది వర్తించనుంది. 2020-21లో 1 నుంచి 6వ తరగతులను ఇంగ్లీషులోకి మార్చిన ప్రభుత్వం వారు టెన్త్ కు వచ్చాక ఇంగ్లీషులోనే పరీక్షలు రాయాలని రూల్ పెట్టింది.

Tenth Students
ఇప్పటి వరకు ఇంగ్లీషు మీడియం వాళ్లు ఇంగ్లీషులోనే, తెలుగు మీడియం వాళ్లు తెలుగులోనే రాసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వీరికి అద్భుతమైన అవకాశం కల్పించిందని పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొంత మంది ఇంగ్లీషు మీడియం విద్యార్థులు తెలుగులో పరీక్షలను సరిగ్గా రాయలేకపోతున్నారు. వారికి ఇది మంచి అవకాశం గా భావిస్తున్నారు.