ఏ క్షణమైనా బాంబుల మోత మోగొచ్చు, ఎటునుంచైనా క్షిపణులు దూసుకురావచ్చు.. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న దేశం.. క్షణాల వ్యవధిలోనే యుద్ధరంగంలోకి కాలు మోపాల్సి రావచ్చు.
అందుకే.. అప్రమత్తంగా ఉండండి. ఏం జరిగినా.. భరించేందుకు సిద్ధంగా ఉండడండి. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్త.. వారికి కావాల్సిన వస్తువుల్ని నిల్వ చేసుకొండి. ఇవీ.. ఇప్పుడు పశ్చిమాసియా దేశాల్లో వినిపిస్తున్న ప్రభుత్వ ప్రకటనలు, కనిపిస్తున్న కరపత్రాలు. ఈ సన్నాహాలు, ఏర్పాట్ల గురించి తెలుసుకుని.. అంతర్జాతీయంగా ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ దేశాలు ప్రపంచాన్ని మరో యుద్ధం వైపు నడిపిస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రష్యా మీదకు దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి అమెరికా అనుమతించిన నేపథ్యంలో.. తొలిదాడిలో 6 దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడులు చేసింది. వాటిని అడ్డుకుని కూల్చేసిన రష్యా.. ప్రతిదాడులకు సిద్ధమైంది. ఈ తరుణంలోనే అణు యుద్ధానికి అనుమతించే దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకాలు చేశాడు. దాంతో.. ఏం జరగబోతుందోనని నాటో దేశాలతో పాటు పశ్చిమాసియా దేశాల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి.
ఇప్పుటికిప్పుడు యుద్ధం ముంచుకొస్తే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ఆయా దేశవాసులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఇందుకోసం లక్షల కొద్ది కరపత్రాలను ప్రింట్ చేసి పంపిణీ చేస్తున్నారు. ఇందులో.. యుద్ధం కారణంగా కమ్యూనికేషన్లు తెగిపోతాయని, విద్యుత్ కోతలు అనివార్యం అవుతాయని తెలిపింది. రహదారులు విధ్వంసం అవుతాయని, మంచి నీటి సరఫరా ఆగిపోతాయని తెలిపిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుపుతూ.. కరపత్రాల్లో జాగ్రత్తలు వివరించారు.
యుద్ధ క్షేత్రాల్లోకి అనుకోకుండా అడుగుపెట్టాల్సి వస్తే.. ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందన్న ఆయా ప్రభుత్వాలు.. పిల్లలు, వృద్ధుల కోసం ఆహారాన్ని ముందే సిద్ధం చేసుకోవాలని సూచనలు చేసింది. ముఖ్యంగా చిన్నారులకు డైపర్లు, అత్యవసర మందులు, పాలు సహా ఇతర పదార్థాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపింది.
సమీపంలో బాంబు దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలో కూడా ఈ కరపత్రాల్లో తెలిపిన స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు.. రక్త స్రావం జరిగితే ఎలా వ్యవహరించాలో తెలుపుతూ పలు సూచనలు చేసింది. క్షతగాత్రుల్ని ఎలా తరలించాలి, చుట్టూ నెలకొన్న ఆందోళనల్ని ఎలా తట్టుకోవాలో తెలిపింది. అలాగే.. పెంపుడు జంతువుల సంరక్షణ, సంక్షోభం, యుద్దం గురించి పిల్లలకు ఏలా వివరించాలో సైతం తెలిపింది.
రెండో ప్రపంచ యుద్ధం నాటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ అవగాహన పత్రాలన.. ఆ తర్వాత ఇప్పటి వరకు ఐదు సార్లు పంపిణీ చేయాల్సి వచ్చిందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ప్రపంచ స్థితిగతులు దారుణంగా దిగజారయన్న ఆయా దేశాలు.. మన పరిసరాల్లోనే యుద్ధం జరుగుతోందని, విపరీత వాతావరణ సంఘటనలు సర్వసాధారణంగా మారాయని తెలిపింది. టెర్రర్ బెదిరింపులు, సైబర్ ఎటాక్‌లు, తప్పుడు ప్రచారాలు.. తమను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రకటించారు. “ఈ బెదిరింపులను నిరోధించేందుకు మనం ఐక్యంగా నిలబడి, మన దేశం పట్ల బాధ్యత వహించాలి. మనం దాడి చేయాల్సి వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరూ స్వీడన్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో సహాయం చేయాలి” అంటూ యుద్ధవాతావరణం గురించి ముందస్తు హెచ్చరిక పత్రాల్లో పేర్కొంది.
అయితే ఎవరూ రష్యా పేరును ప్రస్తావించ లేదు. అలాగే అణు, రసాయన లేదా జీవ ఆయుధాలతో దాడికి ఎలా ప్రతిస్పందించాలో కూడా స్వీడిష్ గైడ్ వివరిస్తుంది.
వైమానిక దాడి చేసినప్పుడు తీసుకునే జాగ్రత్తలనే తీసుకోవాలన్న స్వీడన్.. బంకర్లలో ఆశ్రయం తీసుకోవాలని సూచించింది. అణు దాడులు జరిగితే.. రెండు రోజుల తర్వాత రేడియేషన్ బాగా తగ్గిపోతుందని.. అప్పుడు పరిస్థితుల్ని బట్టి బయటకు రావాలని పేర్కొంది.
రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత.. స్వీడన్, ఫిన్లాండ్ అట్లాంటిక్ కూటమిలో చేరాయి. ఫిన్లాండ్ రష్యాతో 1,340 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటోంది. ఈ కారణంగానే.. ఇక్కడ యుద్ధ భయాలు ఎక్కువగా ఉన్నాయి.