ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తతున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల పై దారుణ వ్యాఖ్యలు చేసిన రీతిలోనే ఇప్పుడు చంద్రబాబు తల్లిదండ్రులపై నీచమైన కామెంట్లు చేశారు.
కొద్ది రోజుల కిందట జగన్ ఏర్పాటు చేసుకున్న ప్రెస్ కాన్ఫరెన్సులో చంద్రబాబును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంకటేశ్వరా యూనివర్సిటీలో కొట్టారు అంటూ కామెంట్లు చేసి అబద్ధాన్ని ప్రచారం చేసేందుకు జగన్ ప్రయత్నించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యూనివర్సిటీలో చదివిన కాలానికి, చంద్రబాబు చదివిన కాలానికి నాలుగేళ్లు తేడా ఉన్నా కూడా జగన్ కావాలనే చంద్రబాబును అవమానించే రీతిలో అసహ్యంగా మాట్లాడాడు.
తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు తల్లిదండ్రులేం చేశారు జగన్ అంటూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తతున్నాయి. జగన్ రెడ్డి బుర్ర ఎంత బురదలో ఉంటుందో బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడూ, ఆ తర్వాత కూడా తన కుటుంబాన్ని రోడ్డున పడేసుకున్నారు. వారితోనే ఇష్టం వచ్చినట్లుగా తిట్లు తింటున్నారు.
వారిని తన సోషల్ సైకోలతో తిట్టిస్తున్నారు. మనిషి అనే లక్షణాలు ఉన్న ఎవరైనా ఇలా చేయరండి బాబూ అని సామాన్యులు సైతం ఆశ్చర్యపోయేంతగా ఆయన ప్రవర్తన ఉంటుంది. ఇది నిజమేనని తాజాగా చంద్రబాబు తల్లిదండ్రుల ప్రస్తావన తీసుకు వచ్చి మరోసారి నిరూపించారన్న విమర్శలు వస్తున్నాయి. తల్లిదండ్రుల్ని చంద్రబాబు చూడలేదనడం.. వారికి అన్నం పెట్టలేదని ఆరోపించాలంటే.. మామూలు స్థాయి వ్యక్తులకు సాధ్యం కాదు.
గతంలో కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని చెప్పిన మానసిక స్థితి ముదిరి పిచ్చిగా మారుతున్న లక్షణాలకు ఇది సంకేతం అనుకోవచ్చని ఎవరైనా అంటే అందులో తప్పేం ఉండదు. చంద్రబాబు తల్లిదండ్రులు ఎప్పుడూ కుమారుడు రాజకీయాల పదవుల్ని చూసి రాజభోగాలు అనుభవించాలనుకోలేదు. కుమారుడు విజయాలను చూపి పొంగిపోయారు కానీ.. మాకేంటి అని ఆశించని వారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా పొలం పనులు చూసుకునేవారు. సొంత ఊరుని దాటి బయటకు వెళ్లడం వారికి ఇష్టం లేదని అందరికీ తెలుసు. ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మలను ప్రజలకు పరిచయం చేయలేదని జగన్ చెబుతున్నారు. పరిచయం చేయడం అంటే బహిరంగసభ పెట్టి వీరు నా తల్లిదండ్రులు అని చెప్పాలా ?. ఈ రోజున చంద్రబాబు తల్లిదండ్రులు ఎవరు అటే… ఖర్జూనరనాయుడు, అమ్మణ్మమ్మ అని ప్రతి ఒక్కరూ చెప్పరా ?.
అంత కంటే వారికి కుమారుడిగా సాధించి పెట్టే గుర్తింపు ఏముంటుంది ? జగన్ తల్లి, చెల్లి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి జగన్ మానసిక స్థితి, మనస్థత్వాలను బయటి పెట్టడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వాటిని ఆపుకోవడానికి ఆయన చంద్రబాబు తల్లిదండ్రులపై పడుతున్నారు. ఇంత ఘోరమైన మనస్థత్వం ఉన్న రాజకీయ నేత మరెక్కడా ఉండలేరేమో ?