అదానీ గ్రూప్‌తో విద్యుత్‌ ఒప్పందం.. క్లారిటీ ఇచ్చిన వైఎస్సార్‌ సీపీ!

www.mannamweb.com


అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌, దేశంలోనే రెండో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి పెద్ద షాక్‌ తగిలింది. అదానీ, మరో ఏడుగురు USలో బిలియన్ల డాలర్ల విలువైన లంచం, మోసానికి పాల్పడ్డారు. అమెరికా కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.

విద్యుత్ కొనుగోలుకు వివిధ రాష్ట్రాలకు అదానీ లంచాలు ఇచ్చారని అమెరికా ఫెడరల్ కోర్టు ఆరోపణలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఈమేరకు అదానీ గ్రూపుతో గత ప్రభుత్వ ఒప్పందాలపై వైసీపీ ప్రకటన విడుదల చేసింది. ఆదానీతో గత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ Solar Energy Corporation of India Limited(SECI)తోనే విద్యుత్ కొనుగోళ్లలో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. రూ.2.49లకే విద్యుత్ కొనుగోలు చేశామని, దానివల్ల ఏటా రూ.3700 కోట్ల ఖజానాపై భారం తగ్గుతుందని తెలిపింది.

అదానీ సంస్థతో ఎటువంటి విద్యుత్ ఒప్పందాలు చేసుకోలేదని స్పష్టం చేసింది. అమెరికా ఫెడరల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై గత ఆరోపణలు మొత్తం ఊహాజనిత ఆరోపణలేనని, ఎస్‌ఈసీఐతో ఒప్పందం కుదుర్చుకుని విద్యుత్ కొనుగోలు చేస్తే లంచాలు ఇచ్చారని ఎలా ఆరోపిస్తారని వైసీపీ ప్రశ్నించింది.