దేశంలోని ఫేమస్ బ్యాంకులన్నీ కూడా ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను మార్చాయి. అందులో యెస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్ వంటి ఫేమస్ బ్యాంక్స్ మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసే కస్టమర్లకు ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. ఈ బ్యాంకులు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తునాయి. ఏకంగా 8.25 శాతం వడ్డీ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ మూడు బ్యాంకుల్లో ఏ టెన్యూర్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి. సపోజ్ మీరు రూ.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే ఏ బ్యాంకులో ఎంత రాబడి వస్తుంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుందాం.
యెస్ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లనేవీ చాలా బాగున్నాయి. ఈ బ్యాంకులో ప్రస్తుతం కస్టమర్లకు 3.25 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు అయితే 3.75 శాతం నుంచి 8.25 శాతం వడ్డీ అందిస్తోంది. ఎక్కువ వడ్డీ రేట్లు 18 నెలల 1 రోజు నుంచి 24 నెలల టెన్యూర్‌పై అప్లై అవుతాయి. అంటే ఇందులో 24 నెలలకు సీనియర్ సిటిజన్ రూ.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. రూ.5,80,100 దాకా వస్తాయి. అంటే వడ్డీనే ఏకంగా రూ.80 వేలు వస్తుంది.ఇక మరో ఫేమస్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 555 రోజుల స్పెషల్ టెన్యూర్ డిపాజిట్ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు ఏకంగా 8 శాతం వడ్డీని ఇస్తుంది. ఈ బ్యాంక్ లో రూ.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే రూ.5,60,150 దాకా డబ్బులు వస్తాయి. అంటే వడ్డీ మొత్తం రూ.60,150 వస్తుంది.
ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఇక ఈ బ్యాంకులో కామన్ కస్టమర్లకు 2.75 శాతం నుంచి 7.35 శాతం దాకా వడ్డీ వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు అయితే 50 బేసిస్ పాయింట్లతో ఎక్కువ వడ్డీ వస్తుంది. దీని ప్రకారం 333 రోజుల డిపాజిట్ స్కీమ్ ద్వారా సీనియర్లకు 7.85 శాతం వడ్డీ వస్తుంది. ఇక ఈ బ్యాంక్ లో రూ.5 లక్షలు ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే సీనియర్లకు వడ్డీ రూ.36,200 దాకా వస్తుంది. అంటే మొత్తంగా రూ.5,36,200 దాకా వడ్డీ వస్తుంది. ఇలా ఈ ఫేమస్ బ్యాంకులన్నీ కూడా FD లపై ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. అయితే ఈ బ్యాంకులలో ఎక్కువ డబ్బుని ఎక్కువ టెన్యూర్ పాటు ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేసినట్లయితే ఎక్కువ వడ్డీ వస్తుంది. దాంతో మీరు పెట్టె పెట్టుబడిపై ఎక్కువ లాభాలు పొందవచ్చు.