RBI గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకున్నా UPI పేమెంట్స్

www.mannamweb.com


యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల ప్రక్రియ ఈజీ అయిపోయింది. చేతిలో నగదు ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎప్పుడంటే అప్పుడు ఒక్క క్లిక్ తో పేమెంట్ చేసే సౌకర్యం ఏర్పడింది. గూగుల్ పే, ఫోన్ పే యూపీఐ యాప్స్ ద్వారా వందల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. 10 రూపాయల పాల ప్యాకెట్ దగ్గర్నుంచి వేలాది రూపాయలు యూపీఐ ద్వారానే పేమెంట్ చేస్తున్నారు. ఆన్ లైన్ చెల్లింపులు అందరికీ యూజ్ ఫుల్ గా మారాయి. ఇదే సమయంలో డిజిటల్ పేమెంట్స్ సురక్షితంగా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. మోసాలు, అవకతవకలు జరగకుండా ఆర్బీఐ కొత్త రూల్స్ ను తీసుకొస్తున్నది.

ఇక ఇప్పుడు మరింత సులభంగా పేమెంట్స్ చేసే విధంగా ఆర్బీఐ యూపీఐ 123 పేను తీసుకొచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్ చేయొచ్చు. ఇది స్మార్ట్ ఫోన్లలోనే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది. ఇదివరకు ఇంటర్నెట్ ఉంటేనే పేమెంట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ చింత లేదు. ఒక వేళ ఫోన్ లో డేటా అయిపోయినా కూడా ఆన్ లైన్ పేమెంట్ చేసేయొచ్చు. ఇదివరకే ఆర్బీఐ తక్కువ మొత్తంలో పేమెంట్స్.. పిన్ అవసరం లేకుండా చేసేందుకు యూపీఐ లైట్ తెచ్చింది. ఇంకా.. యూపీఐ ఐడీని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పంచుకునేందుకు యూపీఐ సర్కిల్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. కాగా యూపీఐ 123 పే ద్వారా ట్రాన్సాక్షన్ లిమిట్ ను కూడా పెంచింది.

ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచింది. దీంట్లో మొత్తం 4 రకాల పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. ఐవీఆర్ నంబర్ల ద్వారా, మిస్డ్ కాల్ సర్వీస్ ద్వారా, OEM- ఎంబడెడ్ యాప్స్ ద్వారా, సౌండ్ బేస్డ్ టెక్నాలజీ ద్వారా ఇక్కడ యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. వీటిని 2025, జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చేలా బ్యాంకులు సహా ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. అయితే యూపీఐ 123 పే కస్టమర్లు ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉండకూడదు.

కస్టమర్ మరొక ఖాతను యాడ్ చేసుకోవాలంటే.. వారు తప్పనిసరిగా ప్రస్తుత బ్యాంక్ ఖాతాను రిజిస్టర్ చేసి, ఆపై మరొక బ్యాంక్ ఖాతాను జోడించాలి. యూపీఐ 123 పేతో బ్యాంక్ ఖాతాను ఎలా లింక్ చేయాలంటే.. మొదట ఏదైనా ఐవీఆర్ నెంబర్ కి కాల్ చేయాలి. ఆతర్వాత భాషను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయాలి. ఇప్పుడు యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి.