OTT లవర్స్‌కు పండగే.. ఫ్రీ OTT అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం

www.mannamweb.com


ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక థియేటర్ కు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. తమకు నచ్చిన సినిమాలను ఓటీటీలో నే చూస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీలకు ఆదరణ పెరిగింది. యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు ఇంట్రెస్టింగ్ సిరీస్ లు, సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. ప్రతి వారం సరికొత్త కంటెంట్ తో యూజర్లను సర్ ప్రైజ్ చేస్తున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలను రిలీజ్ చేస్తూ ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తున్నాయి. తమకు ఇష్టమైన సినిమాలను థియేటర్లో మిస్సైన వారు ఓటీటీ రిలీజ్ ల కోసం వెయిట్ చేస్తున్నారు. అదీకాక థియేటర్ కు వెళితే బోలెడంతా ఖర్చు. ఓటీటీలో అయితే ఎంచక్కా ఇంట్లో కూర్చుని సినిమాలు చూసేయొచ్చు.

అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్స్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ అగ్ర OTT యాప్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఓటీటీలకు నెలవారీ, ఏడాది చొప్పున ఛార్జీలు చెల్లిస్తూ సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఓటీటీ లవర్స్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇప్పుడు వాటికి పోటీగా, భారత ప్రభుత్వం తన స్వంత OTT యాప్‌ని వేవ్స్ పేరుతో తీసుకువచ్చింది. ఉచితంగా ఓటీటీని అందించేందుకు రెడీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా ప్రసారాల సంస్థ ప్రసార భారతి సొంత ఓటీటీని ప్రకటించింది. వేవ్స్ పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆవిష్కరించింది. ఈ ఓటీటీ వేదికగా రామాయణం, మహాభారతం వంటి వాటిని ఉచితంగా అందిస్తామని వెల్లడించింది.

వీటితోపాటు రేడియో కార్యక్రమాలు, భక్తి పాటలు, ఆటలు, ఇ-బుక్స్ వంటివి సైతం ఉచితంగానే అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని యూజర్లకు సూచించింది. ప్రస్తుతం ఈ వేవ్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. గవర్నమెంట్ అందించే ఫ్రీ ఓటీటీతో చాలామందికి ప్రయోజనం చేకూరనున్నది. 12 కంటే ఎక్కువ భాషల్లో 10కిపైగా కేటగిరీల్లో విభిన్నమైన కంటెంట్ పొందవచ్చని తమ యూజర్లకు తెలిపింది ప్రసార భారతి. వీటిలోనే వీడియో ఆన్ డిమాండ్ కంటెంట్, ఫ్రీ గేమింగ్, రేడియో స్ట్రీమింగ్ సైతం ఉంటాయని తెలిపింది.

మీరు వేవ్స్‌లో అనేక ఈవెంట్‌లను ప్రత్యక్షంగా చూడవచ్చు. మీరు అయోధ్య నుండి లార్డ్ శ్రీ రామ్ లాలా యొక్క ఆరతిని ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రతి నెలా ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ వినవచ్చు. నవంబర్ 22న ప్రారంభమయ్యే US ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ కూడా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ ఓటీటీలో అలనాటి చిత్రాలు, మదురమైన పాటలు వినోద కార్యక్రమాలైన ఛోటా భీమ్, అక్బర్ బీర్బల్, తెలనాలీరామ్ వంటి యానిమేటెడ్ సినిమాలు సైతం అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.