ప్రధానమంత్రి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌లో ఏటా రూ.30-36 వేల స్కాలర్‌షిప్‌, ఎవరికి లభిస్తుందంటే..

www.mannamweb.com


కేంద్రీయ సైనిక బోర్డ్‌ ద్వారా అందించే ప్రధానమంత్రి స్కాలర్ షిప్ స్కీమ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్కీమ్‌ ద్వారా ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు అభ్యసిస్తున్న అర్హత కలిగిన అభ్యర్థులకు స్కాలర్‌‎షిప్ అందిస్తారు. నవంబర్‌ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రధాన మంత్రి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ద్వారా 2024-25విద్యా సంవత్సరంలో ఫుల్‌టైమ్‌ ప్రొఫెషనల్‌, టెక్నికల్‌ కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు స్కాలర్‌ షిప్ చెల్లిస్తారు. ఈ పథకంలో ఎంపికైన బాలురకు ఏటా రూ.30వేలు, బాలికలకు రూ.36వేల స్కాలర్‌షిప్ లభిస్తుంది. దరఖాస్తులను కేంద్రీయ సైనిక బోర్డ్‌ వెబ్‌సైట్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 30. ప్రధానమంత్రి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ మాజీ సైనికోద్యోగులు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, కోస్ట్‌ గార్డ్‌ బలగాల్లో పనిచేసిన వారి సంతానానికి మాత్రమే వర్తిస్తుంది. సాధారణ పౌరులు ఈ స్కీమ్‌కు అర్హత ఉండదు.

ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ పథకం 2006-07 విద్యా సంవత్సరం నుండి మాజీ సైనికులు/ మాజీ కోస్ట్ గార్డ్ సిబ్బంది మరియు వారి వితంతువులపై ఆధారపడిన సంతానానానికి ఉన్నత సాంకేతిక మరియు వృత్తిపరమైన విద్యను అందుకునేందుకు ప్రవేశపెట్టారు.

ప్రతి విద్యా సంవత్సరంలో మొత్తం 5500 వార్డులు/ మాజీ సైనికుల వితంతువులు స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేస్తారు. బాలబాలికలకు వేర్వేరుగా 2750మంది చొప్పున ఈ పథకానికి ఏటా ఎంపిక చేస్తారు.

ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలతో ఆమోదించబడిన రెండు నుండి ఐదు సంవత్సరాల కాల వ్యవధి ఉన్న ఫుల్‌టైమ్‌ కోర్సులకు స్కాలర్‌షిప్‌లు వర్తిస్తాయి. ఎంపికైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఏటా చెల్లిస్తారు.
స్కాలర్‌షిప్‌కు అర్హతలు..

2024-25లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అడ్మిషన్‌ పొందిన వారు మాత్రమే PMSS కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు KSB వెబ్ పోర్టల్ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు కనీస విద్యా అర్హత (MEQ) 10+2/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్‌లో 60% మరియు అంతకంటే ఎక్కువ స్కోర్ చేసి ఉండాలి.

కోర్సులో 2వ లేదా తదుపరి సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు పథకానికి అర్హులు కాదు. డిపెండెంట్‌గా ఉన్న విద్యార్థులు/ మాజీ సైనికులు & మాజీ కోస్ట్ గార్డ్ సిబ్బంది వితంతువులు మాత్రమే ఈ పథకానికి అర్హత పొందుతారు. పారా మిలిటరీ సిబ్బందితో సహా సాధారణ పౌరులకు ఈ పథకం వర్తించదు.
స్కాలర్‌ షిప్‌ ఎంపిక

కనీస విద్యార్హత పరీక్షల్లో వచ్చిన మార్కులు, సైనిక చర్యల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులు, సైనిక చర్యలు, విధి నిర్వహణలో శాశ్వత వైకల్యం పొందిన వారి పిల్లలు, విధి నిర్వహణలో రకరకాల కారణాలు, ప్రమాదాలు, సైనిక చర్యల్లో మరణించిన వారి పిల్లలు, విధినిర్వహణలో వికలాంగులుా మారిన వారి పిల్లలు,గ్యాలంట్రీ అవార్డులు పొందిన వారి పిల్లలకు ప్రాధాన్యత ఇస్తారు.
అర్హత గల కోర్సులు

PMSS పథకానికి ఈ కింద కోర్సులు వర్తిస్తాయి. BE, B.Tech, BDS, MBBS, B.Ed, BBA, BCA, B ఫార్మా, BA.LLB మొదలైన ఫుల్‌టైమ్‌ కోర్సులలో అడ్మిషన్లు పొందిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నేషనల్ మెడికల్ కమిషన్, UGC వంటి సంస్థల గుర్తింపు కలిగిన కోర్సుల్ని మాత్రమే అనుమతిస్తారు. MBA / MCA కోర్సులు మినహా మాస్టర్ డిగ్రీ కోర్సులు PMSSకి అర్హత లేదు.

విదేశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కారు.

· PMSS కింద దూరవిద్య/వృత్తి కోర్సులు అనుమతించరు.

· PMSS లో గరిష్టంగా ఒక కోర్సుకు మాత్రమే స్కాలర్‌షిప్‌ పొందగలరు.

దరఖాస్తుతో జత చేయాల్సిన పత్రాలను ఈ లింకు ద్వారా చూడండి..

https://online.ksb.gov.in/writereaddata/DownLoad/Check-List-Application.pdf