ఏపీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామాల వారీగా అర్హులైన విద్యార్థుల జాబితాలను సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు.
ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రియంబర్స్మెంట్ ను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారభించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అర్హులైన విద్యార్థులు…రేషన్ కార్డు, అందులోని కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుల జీరాక్స్ లు, తల్లి-విద్యార్థి పేరిట ఉన్న జాయింట్ అకౌంట్ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాలి. వీటితో పాటు దరఖాస్తు ఫారమ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఫారమ్ సచివాలయాల్లో అందుబాటులో ఉంది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియలో ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నారు. స్కాలర్ షిప్ లను తల్లి, విద్యార్థి జాయింట్ అకౌంట్ లో జమ చేస్తారు. ఈ నెల 27 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు సమాచారం. స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కు అర్హులైన ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యార్థుల వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి.
సచివాలయాల్లో సమర్పించాల్సిన పత్రాలు
ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు ఫారమ్
రేషన్ కార్డు
కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు
తల్లి, విద్యార్థి జాయింట్ అకౌంట్ వివరాలు