సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. విలువైన ఆటగాళ్లను కొనుగొలు చేయకుండా ఆమె చోద్యం చూస్తోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్-2025కు సంబంధించిన మెగా వేలం ఆదివారం మొదలైంది. ఈక్రమంలో కీలక ఆటగాళ్లపై పలు ప్రాంచైజీలు కన్నేశాయి. అధిక ధరను చెల్లించి మరీ తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకుంటున్నాయి. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ మాత్రం పెద్దగా పేరులేని ఆటగాళ్లను మాత్రమే సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
మార్క్యూ సెట్ 2 ముగిసేలోపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక్క ఆటగాడిని మాత్రమే కొనుగోలు చేసింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీని దక్కించుకుంది. రూ. 10 కోట్లు చెల్లించి తీసుకుంది. కిల్లర్ మిల్లర్‌గా గుర్తింపు పొందిన ఆటగాడు డేవిడ్ మిల్లర్ తక్కువ ధరకే అందుబాటులోకి ఉన్నప్పటికీ అతన్ని తీసుకోవడానికి కావ్య మారన్ ఆసక్తి చూపించలేదు. దీంతో డేవిడ్ మిల్లర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 7.50 కోట్లతో దక్కించుకుంది.రిషబ్ పంత్ కోసం రూ. 19.50 కోట్లకు పెంచింది. చివరికి అతన్ని LSG రూ. 27 కోట్లకు ఫైనల్ చేసుకుంది.
బౌలర్ అర్షదీప్ సింగ్ కోసం కావ్య మారన్ చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అర్షదీప్ సింగ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి.ఈక్రమంలోనే 15. 75 కోట్లకు హైదరాబాద్ వేలంలో దక్కించుకోగా.. పంజాబ్ జట్టు అతన్ని రూ. 18 కోట్లకు రైట్ టు మ్యాచ్ పద్ధతి ద్వారా తిరిగి అర్షదీప్ సింగ్‌ను సొంతం చేసుకొంది. దీంతో కావ్య మారన్‌కు నిరాశే ఎదురైంది.