ఇంట్లో సాధారణంగా చెదలు పట్టడం కామన్. చెదలు చూడటానికి చిన్నగా ఉన్నా.. వచ్చే నష్టం అంతా ఇంతా కాదు. చెక్క కిటికీలు, తలుపులు, గోడలను, పుస్తకాలను కూడా తినేస్తూ ఉంటాయి.
ఈ చెదను ఎప్పటికప్పుడు వదిలించుకోవాలి. లేదంటే మాత్రం ఇల్లు మాత్రం నాశనం అయిపోతాయి.
ఈ చెదల సమస్య ఎక్కువగా వానాకాలం, చలికాలంలో ఉంటుంది. ఈ సీజన్‌లోనే చెదలు సంతానోత్పత్తిని చేస్తాయి. అందుకే ఇంట్లో చెదలు ఉంటే వాటిని ముందుగానే గుర్తించి.. ఈజీగా తరిమి కొట్టవచ్చు
నిమ్మరసం, వెనిగర్‌తో చెద పురుగులను ఈజీగా తొలగించుకోవచ్చు. ఈ రెండింటిని మిక్స్ చేసి.. చెదు పురుగులు ఉన్న చోట స్ప్రే చేయండి. ఈ వాసనకు చెదలు వెంటనే పారిపోతాయి. ఇలా వారంలో ఒక్కోసారి మూల మూలల్లో కొడుతూ ఉంటే.. చెద పురుగులు త్వరగా పట్టవు.
సిట్రస్ ఆయిల్‌తో కూడా చెద పురుగులను తరిమి కొట్టవచ్చు. సిట్రస్ పండ్లతో వచ్చే వాసన.. చెద పురుగులకు పడదు. సిట్రస్ ఆయిల్‌ని నీటిలో కలిపి ఇంట్లోని అన్ని మూలలు, షెల్ఫ్‌ల వద్ద కొడితే చెదలు పోతాయి.
వేప నూనెతో కూడా చెదలను వదిలించుకోవచ్చు. వేప నూనె నుంచి ఘాటు వాసన వస్తుంది. కాబట్టి ఈ నూనెనె స్ప్రే చేయడం వల్ల చెదలను త్వరగా వదిలించుకోవచ్చు.