దేశవ్యాప్తంగా పులు రాష్ట్రాల్లో తెలుగు ఓటర్లు గణనీయంగా కనిపిస్తారు. ముఖ్యంగా దక్షిణాదిన వివిధ రాష్ట్రాల్లోని పలు సెగ్మెంట్లలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.
అటు చూస్తే తెలుగురాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్‌కళ్యాణ్‌కి బాషారహితంగా అభిమానులకు కొదవలేదు. ఆ క్రమంలో బీజేపీ జనసేన అధ్యక్షుడ్ని తన ట్రంప్ కార్డుగా మార్చుకుంటుందా? సనాతన ధర్మ సూత్రాలతో దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతున్న జనసేనాని ఎన్డీఏ కూటమికి స్టార్ క్యాంపెయిన్ కానున్నారా? మొన్న తెలంగాణ నిన్న ఆంధ్ర ప్రదేశ్‌లో పవర్ చూపించి.. మహారాష్ట్ర ప్రచారంలో సత్తా చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నెక్ట్స్ టార్గెట్ ఏంటి?
మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి సారథ్యంలోని మహాయుతి- ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఈ విజయంలో జనసేనాని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్రను తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. పవన్ ప్రచారం చేసిన షోలాపూర్, పూణే, లాతూర్, బల్లార్ పూర్, కసబపేట్, డేగులూర్, భోకర్ లాంటి చోట్ల అధిక స్థానంలో బిజెపి కూటమి గెలుపొందింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఆయా ప్రాంతాల్లో పవన్ సభలకు ప్రజలు స్వచ్ఛంధంగా పోటెత్తారు. మరాటా గడ్డపై తెలుగు ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల పవన్ ఇమేజ్ ఏంతో మహా ఫలితాలతో వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన ఇమేజ్‌తో జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి యావత్తు దేశం దృష్టిని ఆకర్షించిన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అవతల పవన్ చరిష్మా పైఎవరికైనా సందేహాల్లాంటివి ఉంటే అవన్నీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర మొదలుకుని కింద ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి ప్రధాన ప్రచార అస్త్రంగా మారారు.
మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో పవన్ చరిష్మా ను వాడకుని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు బిజెపి పెద్దలు రెడీ అవుతున్నట్లు చెప్తున్నారు. వారి కళ్ళ ముందు ఉన్న నెక్స్ట్ బిగ్ మిషన్ “తమిళనాడు” మరో ఏడాదిన్నర లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బిజెపీకి, సంఘపరివార్‌కు తమిళనాడు ఎప్పుడూ కొరకని కొయ్యే. అ్కడ రాజకీయమంతా డీఎంకే, అన్నా డీఎంకే ల మధ్యే నడుస్తుంటుంది. అక్కడ బీజేపీ పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా తమిళనాట ప్రజలు అవకాశం ఇవ్వడంలేదు. రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలితల అస్తమయం తరువాత పరిస్థితులు కొంత మారాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో బిజెపి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది.
తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లు ఉన్నాయి. అక్కడ విజయానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. గత ఎన్నికల్లో డీఎంకే పార్టీ సోలోగా 133 సాధించింది. అంత బలంగా ఉన్న డీఎంకేను ఢీ కొట్టడం అంత సామాన్యమైన పని కాదు. ఇలాంటి తరుణంలో కాషాయ నేతలకు కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే అంటున్నారు.
పవర్‌స్టార్‌గా పవన్‌ను తమిళులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు సనాతన ధర్మం బేస్ చేసుకుని పవన్ చేసిన తమిళ రాజకీయ ప్రసంగాలు, ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్లు తమిళనాట బాగా వైరల్ అయ్యాయి. అలాగే తమిళనాడులో తెలుగు జనాభా కూడా ఎక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేనాని హిట్ కొట్టడంతో.. ఆయన్ని స్టార్ క్యాపెంయినర్‌గా తమిళనడులో దించడానికి బీజేపీ రెడీ అవుతున్నారంట.
తమిళనాడు తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్‌ని సనాతన ధర్మం పేరుతో వినియోగించుకోబోతుందంటున్నారు.. దక్షిణాదిలో ఐదు రాష్ట్రాలు ఉండగా ఒక ఏపీలో మాత్రమే బిజెపి కూటమి అధికారంలో ఉంది.. మహారాష్ట్రలో సాధించిన విజయంతో మిగిలిన చోట్ల పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ అనే ఆయుధాన్ని వినియోగించబోతోందంట.. మొత్తమ్మీద పవన్‌కళ్యాణ్ నేషనల్ లీడర్‌గా ఫోకస్ అవుతుండటంతో జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు.