ప్రస్తుత రోజుల్లో పిల్లల స్కూల్ ఫీజులు తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారిపోయాయి. సామాన్యులను, మధ్య తరగతి వారిని బెంబేలెత్తిస్తున్నాయి. చదువుకోవాలంటే కొనుక్కోవాలి అనే పరిస్థితికి వచ్చింది. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పేద వారు పిల్లలను చదివించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎంతో మంది చదువుకు దూరమవుతున్నారు. చదువుకోవాలనే కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బు లేని కారణంగా చదువును కొనసాగించలేకపోతున్నారు. చదువు మానేసి ఏదో ఓ పని చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఇలాంటి విద్యార్థులను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్ షిప్స్ అందిస్తున్నాయి.
ఎడ్యుకేషన్ లోన్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కొన్ని కార్పోరేట్ సంస్థలు కూడా స్కాలర్ షిప్స్ అందిస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టెన్త్ పాసైన వారికి గుడ్ న్యూస్ అందించింది. విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించేందుకు రెడీ అయ్యింది. అయితే ఇది విద్యార్థులందరికీ కాదు. కేవలం బాలికలకు మాత్రమే. బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ను ఏటా అందిస్తున్నది. తాజాగా సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024 ను ప్రకటించింది. ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు ఎవరంటే.. సీబీఎస్ఈ స్కూల్ అనుబంధ పాఠశాలల్లో పదో తరగతి పాసైన విద్యార్థినులు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థినులకు ఏడాదికి రూ. 6 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు.
విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సీబీఎస్ఈలో టెన్త్ పాసై ఉండాలి. సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 11, 12 తరగతులలో విద్యను అభ్యసిస్తూ ఉండాలి. 60 శాతం మార్కులతో 10వ తరగతి అర్హత సాధించిన సింగిల్ గర్ల్ చైల్డ్ దరఖాస్తు చేసుకోవడాపనికి అర్హులు. విద్యార్థి యొక్క నెలవారీ ట్యూషన్ ఫీజు 10వ తరగతిలో రూ. 1,500 కంటే ఎక్కువ ఉండకూడదు. 11, 12వ తరగతిలో 10 శాతం కంటే ఎక్కువ పెరుగుదల ఉండకూడదు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థినులు డిసెంబర్ 23వ తేదీలోగ ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థినులు సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ పూర్తి వివరాల కోసం www.cbse.gov.in వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.