13 ఏళ్ల పిల్లోడిపై కోట్ల వర్షం.. తొలిసారి ఐపీఎల్‌లో లక్కీ ఛాన్స్..

www.mannamweb.com


బీహార్‌కు చెందిన 13 ఏళ్ల ఆటగాడు వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.

1 కోటి 10 లక్షల ధరతో కొనుగోలు చేసింది. వైభవ్ బేస్ ధర రూ. 30 లక్షలు కాగా ఇప్పుడు అతను తొలిసారిగా ఐపీఎల్‌లో ఆడబోతున్నాడు. వైభవ్ సూర్యవంశీ వయసు 13 ఏళ్లే అయినా అతడి బ్యాటింగ్‌లో సత్తా ఉంది. ఇటీవల వైభవ్ ఇండియా అండర్-19 జట్టులో ఆడాడు. అక్కడ అతను ఆస్ట్రేలియా-ఎపై అద్భుతమైన సెంచరీ చేశాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌ నుంచి 14 ఫోర్లు, 4 సిక్సర్లు వచ్చాయి. వైభవ్ సూర్యవంశీ తన తుఫాన్ బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. అందుకే అతనిపై ఐపిఎల్‌లో భారీగా డబ్బుల వర్షం కురిపింది.

వైభవ్ సూర్యవంశీ పేరు రాగానే సోషల్ మీడియా షేక్..

ఐపీఎల్ 2025 వేలంలో వైభవ్ సూర్యవంశీ పేరు వచ్చిన వెంటనే, అతనిని కొనుగోలు చేయడానికి ఢిల్లీ, రాజస్థాన్ జట్లు సిద్దమయ్యాయి. ఈ రెండు బృందాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఢిల్లీ వైభవ్‌పై బిడ్డింగ్ మొదలుపెట్టగా, రాజస్థాన్ కూడా ఈ ఆటగాడిపై కాసుల వర్షం కురిపించింది. వైభవ్ సూర్యవంశీ బీహార్‌లోని తాజ్‌పూర్‌లో నివసిస్తున్నాడు. ఈ ఆటగాడు 7 సంవత్సరాల వయస్సు నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. అతను వారానికి నాలుగు సార్లు పాట్నాకు 3 గంటల పాటు రైలులో ప్రయాణించేవాడు.

ఐపీఎల్‌లో ఐదుగురు యువ ఆటగాళ్లు..

ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. దీనికి ముందు, రే బర్మన్ RCB తరపున అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. అతనిని 16 సంవత్సరాల వయస్సులో RCB కొనుగోలు చేసింది. ముజీబ్ ఉర్ రెహమాన్ 17 ఏళ్ల వయసులో IPLకి వచ్చాడు.