రెడ్మి నోట్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 9 వ తేదీన భారత్ మార్కెట్ లో విడుదల కానుంది. దీంతోపాటు ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ ల కొన్ని స్పెసిఫికేషన్ ల వివరాలు వెల్లడయ్యాయి.
అయితే తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్లోరెడ్మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ ను (Redmi Note 13 Pro Smatrtphone) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 1.5K రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంది. మరియు 67W టర్బో ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.
రెడ్మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ వేరియంట్లు :
రెడ్మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ (Redmi Note 13 Pro Amazon Sale Offer) ప్రస్తుతం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మరియు ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్నైట్ బ్లాక్, స్కార్లెట్ రెడ్ వంటి నాలుగు రంగుల్లో లభిస్తుంది.
రెడ్మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర :
అమెజాన్‌లో ప్రస్తుతం 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.18,568 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.20,189 గా ఉంది. అదే 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.21,599 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు.
రెడ్మీ నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
రెడ్మీ నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల 1.5k కర్వడ్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు ఈ డిస్ప్లే 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్ను కలిగి ఉంది. మరియు ఈ డిస్ప్లే గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను పొందుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులో ఉంది.
67W టర్బో ఛార్జ్ సపోర్టు :
రెడ్మీ నోట్ 13 ప్రో హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS ను కలిగి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ చిప్సెట్ Adreno A710 GPU తో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ 67W టర్బో ఛార్జ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
200MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ రెడ్మి స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేజైషన్) సపోర్టుతో 200MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్ సెట్ 16MP కెమెరాతో అందుబాటులో ఉంది.