సినీ నటుడు శ్రీతేజ్ పై కేసు నమోదు

ప్రముఖ సినీ నటుడు శ్రీతేజ్ పై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

కాగా.. శ్రీతేజ్ పై గతంలోనూ ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఓ మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి ఆ మహిళ భర్త గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు శ్రీతేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆ కేసు విచారణ కొనసాగుతుండగానే తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో శ్రీతేజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.