ఇకపై పాన్‌ కార్డుకు క్యూఆర్ కోడ్.. మరి పాత కార్డుల పరిస్థితేంటి? పడేయాల్సిందేనా

www.mannamweb.com


పాన్ కార్డులను అప్ గ్రేడ్ చేయడానికి పాన్ 2.0 ప్రాజెక్టుకు ఆమోదం లభించింది కేంద్రం. పాన్ కార్డులు క్యూఆర్ కోడ్లతో జారీ చేస్తారు.. పాత కార్డులున్న వారికి క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డు ఎలా వస్తుంది అని అందరికీ ఆలోచన ఉంటుంది.

మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా?

పాత పాన్ కార్డు వ్యక్తులు పాన్ నెంబర్ మార్చాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మీకు కొత్త పాన్ కార్డు వస్తుంది. కొత్త కార్డులో క్యూఆర్ కోడ్ వంటి ఫీచర్లు ఉంటాయని వైష్ణవ్ తెలిపారు. పాత పాన్ కార్డు ఉన్నవారు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. పాన్ అప్‌గ్రేడేషన్ ఉచితమని, అది మీకు డెలివరీ అవుతుందని కేంద్రమంత్రి వెల్లడించారు.

ఇప్పటి వరకు పాన్ కార్డును ఆపరేట్ చేసే సాఫ్ట్ వేర్ 15 నుంచి 20 ఏళ్ల నాటిదని, ఇది అనేక సమస్యలను తెచ్చిపెడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త విధానంలో పాన్ కార్డుకు సంబంధించిన అన్ని వ్యవస్థలు డిజిటల్ విధానంలో తయారవుతాయని, తద్వారా ఫిర్యాదులు సకాలంలో పరిష్కారమవుతాయని పేర్కొంది. ఇప్పటికే 78 కోట్ల పాన్ కార్డులు జారీ అయ్యాయి.

ప్రస్తుతమున్న పాన్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయడం, కోర్, నాన్ కోర్ పాన్/టాన్ యాక్టివిటీస్, పాన్ వెరిఫికేషన్ సేవలను ఏకీకృతం చేయడం ఈ కొత్త విధానం లక్ష్యం. పాన్ 2.0 ప్రయోజనాలను వివరిస్తూ కేంద్రమంత్రి వైష్ణవ్ మాట్లాడారు. ‘ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అప్డేట్ చేస్తున్నాం. డేటాను సంరక్షించడానికి పాన్ డేటా వాల్ట్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. యూనిఫైడ్ పోర్టల్ ఉంటే ఇతర పోర్టళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.’ అని చెప్పారు.

ఇది పన్ను చెల్లింపుదారులకు డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందిస్తున్నారు. మీ పాత పాన్ కార్డ్ పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. ఈ అప్‌గ్రేడ్ ఇప్పటికే ఉన్న పాన్ కార్డ్‌ల చెల్లుబాటును ప్రభావితం చేయదు. క్యూఆర్ కోడ్‌ని చేర్చడానికి మీ ప్రస్తుత పాన్ కార్డ్‌ని అప్‌గ్రేడ్ చేయాలి. దీనికి ఎలాంటి అదనపు ఖర్చులు ఉండవు.

కొత్త క్యూఆర్ కోడ్ పాన్ కార్డులు డేటా స్థిరంగా, విశ్వసనీయంగా ఉండేలా చేస్తుంది. కొత్త ప్రక్రియ పనిని తగ్గిస్తాయి, మరింత పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయి. అప్‌గ్రేడ్ చేసిన పాన్‌తో మీ డేటా గతంలో కంటే సురక్షితంగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థల అన్ని డిజిటల్ సిస్టమ్‌లలో పాన్‌ను ఒక సాధారణ గుర్తింపుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.