రాష్ట్రం విడిచి పారిపోతున్న స్వరూపానంద

www.mannamweb.com


జగన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించిన విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాష్ట్రం వదిలిపెట్టి పోవాలని నిశ్చయించుకున్నారు.

స్వరూపానంద గతంలో క్రిష్టియన్ అయిన జగన్ రెడ్డికి హిందూత్వం ఇచ్చినట్లు నాటకం ఆడిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు సంబంధింత ఫొటోలు విడుదల చేసి మెజారిటీ హిందువులను మోసం చేశారు. తాను ముఖ్యమంత్రి కావడానికి స్వరూపానంద వేసిన ఎత్తుగడ ఎంతగా ఫలించిందో జగన్ రెడ్డికి తెలుసు.

దాంతో ముఖ్యమంత్రి కాగానే జగన్ రెడ్డి స్వరూపానందకు విశేష ప్రాధాన్యతనిచ్చారు. మంత్రి పదవి కావాల్సిన వాళ్లు అందరూ స్వరూపానంద కాళ్లు పట్టుకున్నవారే. అదే విధంగా కీలకమైన పదవుల కావాల్సిన అధికారులు కూడా స్వరూపానంద దగ్గరకు వెళ్లి పాదపూజ చేశారు. స్వరూపానంద సిఫార్సుల మేరకు చాలా మందికి పదవులు వచ్చాయి. చివరకు అతి విలువైన భూములు కూడా స్వరూపానంద తనవిగా చేసుకున్నాడు. ఈ లోపు ప్రభుత్వం మారడంతో స్వరూపానంద చట్ట విరుద్ధంగా కొట్టేసిన ప్రభుత్వ భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాపసు తీసుకున్నది. తిరుమల కొండపై కూడా స్వరూపానంద తీసుకున్న స్థలాన్ని ఇటీవలే టీటీడీ బోర్డు కూడా వాపసు తీసుకున్నది.

స్వరూపానంద దురదృష్టం కొద్దీ తెలంగాణలో కూడా ప్రభుత్వం మారింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వరూపానంద ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. అయితే తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో స్వరూపానందకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది. తాజాగా శారదాపీఠం స్వరూపానంద స్వామి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏపీలో ప్రభుత్వం మారడంతో రాష్ట్రాన్ని వీడుతోన్న శారద పీఠాధిపతి ఇకపై రిషికేశ్‌లోనే సమయాన్ని గడుపుతానంటూ కీలక ప్రకటన చేశాడు. అంతే కాకుండా తనకు జగన్ రెడ్డి ఇచ్చిన ఎక్స్ క్యాటగిరి భద్రతను కూడా వెనక్కి తీసుకోవాలని స్వరూపానంద డీజీపీకి ఒక లేఖ రాశారు.