సీతాఫలాన్ని పేదవాడి ఆపిల్ గా చెబుతారు. సీతాఫలం శీతాకాలంలో లభించే సీజనల్ ఫ్రూట్. ఇది అనేక పోషకాలతో, మంచి రుచితో చూస్తే చాలు ప్రతి ఒక్కరికి తినాలనిపిస్తుంది.
అంతే కాదు సీతాఫలంలో ఉండే పోషకాలతో మనకు అనేక అనారోగ్యాల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. సీతాఫలంలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. సీతాఫలం ఆకులు, బెరడు, గింజలు, వేరు ఇలా ప్రతి భాగాన్ని చాలా వ్యాధుల నివారణలో ఉపయోగిస్తూ ఉంటారు .
సీతాఫలం ఎవరు తినకూడదు
అయితే అటువంటి సీతాఫలాన్ని కొంతమంది తినకూడదు అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఒకవేళ తిన్నా చాలా మితంగా తినాలని సూచిస్తున్నారు. అసలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సీతాఫలాలను తినకూడదు ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మన దేశంలో డయాబెటిస్ బాధితులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు.
వీరు సీతాఫలాలు తినొద్దు
మన జీవనశైలి కారణంగా, సరైన వ్యాయామం, పౌష్టికాహారం లేకపోవడం, ఒత్తిడి విపరీతంగా పెరగడం వంటి కారణాలతో చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఇక అటువంటి వారికి సీతాఫలాలు తినడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరైతే మధుమేహంతో బాధపడతారో వారు సీతాఫలాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సీతాఫలంలో ఫ్రక్టోజ్ ఉండడం వల్ల ఇది డయాబెటిస్ పేషెంట్స్ కు మంచిది కాదని చెబుతున్నారు.
సీతాఫలాలు తింటే ఈ సమస్యలు పెరుగుతాయి
అయితే ఇన్సులిన్ ఉపయోగించిన డయాబెటిస్ పేషెంట్స్ సీతాఫలాన్ని మితంగా తీసుకోవచ్చని, 15 రోజులకు ఒకటి మాత్రమే తింటే మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక ఈ సీజన్లో ఎవరైతే దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నారో, వారు సీతాఫలాలకు దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. జలుబు, దగ్గుతో బాధపడే వారికి సీతాఫలాలు ఎక్కువ తింటే సమస్య మరింత పెరుగుతుంది.
సీతాఫలాలలో ఈ సమస్యలకు ఆస్కారం
ఎక్కువగా తినడం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడతారని, కొందరు విరోచనాలు సమస్యలతో కూడా బాధపడవచ్చని చెబుతున్నారు. కొంతమందికి సీతాఫలం తింటే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని, సీతాఫలాలతో కొందరికి శరీరం పైన దురద, ఎర్రటి దద్దుర్లు వస్తాయని అలాంటి సమస్య ఉన్నవారు తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.
సీతాఫలాలు వీరు అసలే తినకూడదు
ఇక సీతాఫలంలో అనోనాసిన్ అనే టాక్సిన్ ఉంటుందని, ఎక్కువగా సీత ఫలాలను తినడం వల్ల నరాల సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇక గర్భిణీలుగా ఉన్న మహిళలు కూడా సీతాఫలాలను తక్కువ తింటే మంచిదని సూచిస్తున్నారు. పొరబాటున విత్తనాలు మింగితే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.