దొంగలు మీ పని అయిపోయింది.. ఏఐ ఆన్ డ్యూటీ, మాస్క్ వేసుకున్నా కనిపెట్టేస్తాది

www.mannamweb.com


ఏ దొంగ అయినా ముసుగు వేసుకోకుండా రంగంలోకి దిగుతాడా, ఎదైనా పర్లేదు అనుకునే దైర్యవంతుడు అయితే ముసుగు లేకుండా దొంగతనాలకు పాల్పడతాడు. దేశంలో చాలా దొంగతనాల కేసులు ఆధారాలు లేక కేసులు అలా మిగిలిపోయాయి.
ఈ దొంగతనం కేసులు తేల్చడం అంత ఈజీ కాదు. మనుషులుకు సులభం కాదేమే కానీ ఏఐకి కాదు. అధునాతన టెక్నాలజీ ఏఐ ఇప్పుడు ఎలాంటి ముసుగు దొంగతానలను అయినా ఈజీగా కనిపెడుతుందట. ఇటీవల ఢిల్లీ పోలీసులు AIని ఉపయోగించి స్నాచర్‌ను, దొంగిలించిన ఫోన్‌ను తిరిగి పొందారు. దిల్లీలోని ఒక మహిళ మొబైల్‌ ఫోన్‌ను దొంగలించిన ముసుగు స్నాచర్‌ను పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి పట్టుకున్నారు. నిందితుడు ముసుగు వేసుకొని ఉండటం వల్ల కష్టపడ్డామని ఏఐని ఉపయోగించడం చాలా సులభంగా పని అయ్యిందని అధికారులు తెలిపారు. దొంతనం చేసి పారిపోయిన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అనుసరించినా ముసుగు వల్ల ఎవరనేది తెలియలేదు. అప్పుడు ఫుటేజ్ వీడియోలో స్క్రీన్‌గ్రాబ్ నుంచి ముసుగును వాస్తవంగా తొలగించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సహాయంతో ముసుగుని తొలగించారట. అప్పుడు నిందితుడి మోహం చాలా స్పష్టంగా కనిపించింది. దాని ఆధారంగా అతనిని పట్టుకున్నారు. అతను దొంగలించిన ఫోన్‌ను సేకరించి భాదితురాలికి ఇచ్చారు. ఇలా ప్రతిచోటా ఏఐను ఉపయోగించి కేసులు అన్నిటిని పరిష్కరిస్తే బాగుంటుందని సామాన్య ప్రజలు భావిస్తున్నారు.

ఎఐ ఎలా పనిచేస్తుంది:
ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ ద్వారా, వీడియోలలో ఒక వ్యక్తి ముఖం మీద మాస్క్‌ను తొలగించడం సాధ్యం అవుతుంది. ఈ ప్రక్రియ ప్రధానంగా ఫేస్ డిటెక్షన్, ఫేస్ రికగ్నిషన్, జెనరేటివ్ అడ్వెర్సరియల్ నెట్‌వర్క్స్ (GANs) వంటి అల్గోరిథమ్స్‌పై ఆధారపడి ఉంటుంది.
ఫేస్ డిటెక్షన్: ఎఐ వీడియోలోని వ్యక్తుల ముఖాలను గుర్తిస్తుంది. దీని కోసం హార్కాస్కే లేదా కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్స్ (CNNs) వంటి పద్ధతులను ఉపయోగిస్తారు.
ఫేస్ రికగ్నిషన్: ఇందులో ఎఐ గుర్తించిన ముఖంలో మాస్క్‌ని తీసివేయడానికి ప్రాసెస్ చేస్తుంది. ఇది ఒక నిర్దిష్ట వ్యక్తి ముఖం యొక్క లక్షణాలను గుర్తించి, మాస్క్ దిగువ ఉన్న అసలు ముఖాన్ని ఊహించగలదు.
జెనరేటివ్ అడ్వెర్సరియల్ నెట్‌వర్క్స్ (GANs): GANs ఒక ఫోటోను మెషీన్ ద్వారా సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఎఐ, ఈ టెక్నాలజీని ఉపయోగించి, మాస్క్ వెనక దాచిన ముఖాన్ని సృష్టించడానికి అనువైన మొహం వివరాలను ఫిల్ చేస్తుంది. సినెమాటిక్ సింథసిస్: చివరగా, ఈ సృష్టించిన వివరాలు వాస్తవమైన ముఖంగా మార్చి, వీడియోలో అనుసంధానమవుతుంది. ఇలాగే, ఎఐ మాస్క్‌ను తొలగించడం ద్వారా, వీడియోలోని అసలు ముఖం చూపిస్తుంది.