కొడాలి నాని, వంశీపై లోకేష్ పెద్ద స్కెచ్.. ఇక చుక్కలే

www.mannamweb.com


సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారందరినీ కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది కూటమి సర్కార్. వైసీపీ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని , మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంతకంటే దారుణంగా బూతులతో చెలరేగిపోయారు.

అయితే వారిపై ఎన్ని కేసులు నమోదవుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. అంటే వారిని ఇంకా బలంగా కేసుల్లో ఇరికించాలని కూటమి సర్కారు భావిస్తుందా? లోకేశ్ చెప్తున్నట్లు రెడ్ బుక్ చాప్టర్ త్రీ లో వారు టార్గెట్ కాబోతున్నారా? కేసినో , భూ అక్రమాలు ఇలాంటి కేసులు అతి త్వరలోనే వీరిద్దరికీ చుక్కలు

కూటమి ప్రభుత్వ ఏర్పాడ్డాక గత అయిదేళ్లలో ఇష్టానుసారం సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వైసీపీ మద్దతుదారుల భరతం పడుతున్నారు పోలీసులు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బూతు మంత్రులకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని. ఆయనతో పాటు అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం అదే రేంజ్లో చెలరేగిపోయారు. టీడీపీ టికెట్‌తో రెండు సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి.. రెండో సారి గెలిచినప్పుడు కొడాలి నాని వెంట వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న వంశీ.. అప్పటి వైసీపీ నేతలకంటే ఎక్కువగా బూతు పురాణం వినిపించారు.

అటు గుడివాడ, ఇటు గన్నవరాల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీలపై కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పలు కేసులు నమోదవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లతో పాటు జనసేనాని పవన్‌కళ్యాణ్‌లను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా దూషించినందుకు గాను వరుసగా కేసులు పెడుతున్నారు. దానికి తోడు వారు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే వారిపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు

ఆ ఇద్దరినీ పర్మనెంటుగా బుక్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమతుంది. వారి అక్రమ వ్యవహారాలపై పక్కాగా ఆరా తీసి, పకడ్బందీ సాక్ష్యాలతో చర్యలు చేపట్టడానికి కసరత్తు జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఆ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై కూడా విజిలెన్స్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ కోసం తన వద్ద పని చేసే డ్రైవర్లతో పాటు కూలీల పేరుతో.. తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారంగా ఐదేళ్ల పాటు తవ్వకాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొండలు, గుట్టలు, బంజర భూములు, పోలవరం కట్టలను సైతం తవ్వినట్లు విమర్శలు ఉన్నాయి.

వల్లభనేని వంశీపై ఆరోపణలను ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సైతం ప్రస్తావించారు. దాంతో అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్ అధికారులు దూకుడు పెంచినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు తెలుస్తోంది. సీనరేజి చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు 100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై కూడా విజిలెన్స్ కేసులు నమోదు చేయనున్నట్టు తెలుస్తుంది. ఈఃత్వరలో వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక కొడాలి నాని అరాచకాలపై ఆరోపణలకు కొదవేలేదు. అప్పట్లో ఆయన కేసినో నిర్వహించారని, ప్రత్యర్థులపై క్యాడర్ తో దాడులు చేయించారని ఆరోపణలు వచ్చనా అధికారంలో ఉండటంతో పోలీసులు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అవే కేసుల్ని పోలీసులు వెలికితీస్తున్నారంట. గుడివాడలో టీడీపీ నేతలు, పార్టీ ఆఫీస్ లపై గతంలో వైసీపీ నేతలు చేసిన దాడుల కేసులు పోలీసులు తిరగదోడుతున్నారంట.అప్పట్లో టీడీపీ ఆఫీస్ లో ఉన్న రావి, ఇతరనేతలపై కత్తులు, కర్రలు, ఇనుపరాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు పాల్పడ్డారు .

ఆ దాడులకు సంబంధించి పోలీసులు వీడియో ఫుటేజ్ సేకరించారంట. ఈ దాడుల్లో పాల్గొన్న కొడాలి నాని అనుచరులు, ఇతర వైసీపీ నేతలపై ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు గతంలో కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. అప్పట్లో గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీపైనా వైసీపీ నేతలు దాడులకు పాల్లడ్డారు. కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనల్లో అప్పటి పోలీసులు చర్యలు తీసుకోలేదు. అప్పటి కేసుల్ని వెలికితీసి ఇందులో కొడాలి నాని పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంట.

కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో.. అప్పుడు వారికి కొమ్ము కాసిన పోలీసులే ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, ఆయన కుటుంబసభ్యుల పైనా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీలకి ఉచ్చు బిగిస్తున్నారని అంటున్నారు.

చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యల అంశాన్ని ఫోకస్ చేయకుండా… నాని, వంశీ పాల్పడిన ఇతర కార్యకలాపాలపై నమోదైన కేసుల్లో వారిని జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. వారిలానే సీఎంపై నోరు పారేసుకున్న పెడన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగి రమేశ్ విషయంలో వ్యవహరిస్తున్నట్లుగానే కొడాలి నాని విషయంలోనూ ముందుకెళ్లనున్నట్లు తెలుస్తొంది. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు తన అనుచురులతో కలిసి బాబు ఇంటిపైకి జోగి రమేశ్ దూసుకెళ్లి దాడి చేయడం తెలిసిందే. అయితే ఈ అంశాన్ని ప్రస్తావించకుండా.. అగ్రిగోల్డ్ భూములను జోగి రమేశ్ కుటుంబ సభ్యులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్న కేసుపై ఆయన కుమారుడు జోగి రాజీవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ క్రమంలోనే కొడాలి నాని, వల్లభనేని వంశీల చుట్టు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు చెప్తున్నారు.