ఎంట్రీ లెవల్‌ జాబ్‌కే రూ.11.8 లక్షల ప్యాకేజీ.. జీతాలు భారీగా పెరుగుతున్నాయి

www.mannamweb.com


ఐటీ ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతోంది. దీంతో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఫ్రెషర్స్‌కు భారీ అవకాశాలు ఉన్నాయి. టీమ్‌లీజ్‌ డిజిటల్‌ (TeamLease Digital) లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం..
2024-25 ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్‌లో ఫ్రెషర్స్ ఉద్యోగాలు ఎక్కువగా కోరుకుంటున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI), మెషిన్ లెర్నింగ్, బిగ్‌ డేటా వంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలపై కంపెనీలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. స్పెషలైజ్డ్‌ స్కిల్స్‌కి డిమాండ్‌ పెరుగుతుండటంతో ఆయా రంగాల్లో జీతాలు భారీగా పెరుగుతున్నాయి. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. వచ్చే ఏడాది జాబ్ మార్కెట్ ట్రెండ్, శాలరీలు ఏ రేంజ్‌లో ఉంటాయో చూద్దాం.

* కీలక రంగాల్లో శాలరీ అంచనాలు ఎలా ఉన్నాయి?

– సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అండ్‌ ఇంజనీరింగ్
ఈ విభాగంలో కోడింగ్, సాఫ్ట్‌వేర్ డిజైన్, మెయింటెనెన్స్‌, AI/ML ఇంటిగ్రేషన్ వంటి స్కిల్స్‌కి ఎక్కువ డిమాండ్‌ ఉంది. GCCs (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్)లో రూ.9.37 LPA, ఐటీ ప్రొడక్ట్‌ & సర్వీసెస్‌లో రూ.6.23 LPA, నాన్-టెక్ సెక్టార్స్‌లో రూ.6 LPA వరకు జీతాలు లభిస్తున్నాయి. కంపెనీలు తమ ఆపరేషన్స్‌లో ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌లను ఇంటిగ్రేట్‌ చేస్తున్నందున సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ముఖ్యంగా GCCలలో అధిక జీతాలు అందుకుంటున్నారు.
– సైబర్ సెక్యూరిటీ అండ్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్
ఈ విభాగం ఐటీ సిస్టమ్‌లను రక్షించడం, వల్నరబిలిటీలు గుర్తించడం, రిస్కులు తగ్గించడంపై దృష్టి పెడుతుంది. GCCsలో రూ.9.57 LPA (IT రంగం కంటే 40.12% ఎక్కువ), ఐటీ ప్రొడక్ట్‌ & సర్వీసులో రూ.6.83 LPA, నాన్-టెక్ సెక్టార్స్‌లో రూ.5.17 LPA వరకు శాలరీలు ఆఫర్‌ చేస్తున్నారు. సైబర్‌ సెక్యూరిటీ థ్రెట్స్‌ ఈ డొమైన్‌లో నిపుణులకు అధిక డిమాండ్‌ను సృష్టించింది. GCCలు ప్రీమియం ప్యాకేజీలను అందిస్తున్నాయి.

* డేటా మేనేజ్‌మెంట్ అండ్‌ అనలిటిక్స్
ఈ విభాగం డెసిషన్‌ మేకింగ్‌కి సపోర్ట్‌ చేయడానికి డేటాను సేకరించడం, స్టోర్ చేయడం, అనలైజ్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో GCCలు రూ.8.73 LPA, ఐటీ ప్రొడక్ట్‌ & సర్వీసు రూ.7.07 LPA, నాన్-టెక్ సెక్టార్స్‌ రూ.6.37 LPA వరకు శాలరీలు ఇస్తున్నాయి. పరిశ్రమలు డేటా-బేస్డ్‌ స్ట్రాటజీలపై ఎక్కువగా ఆధారపడటంతో, డేటా సైంటిస్టులు, అనలిస్ట్‌లకు ప్రాధాన్యం పెరుగుతోంది.

* క్లౌడ్ సొల్యూషన్స్ అండ్‌ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ మేనేజ్‌మెంట్
ఇది క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు, ERP సిస్టమ్‌లు, స్కేలబిలిటీ, కాస్ట్‌- ఎఫిషియన్సీపై దృష్టి పెడుతుంది. ఇందులో GCCలు రూ.7.67 LPA, ఐటీ ప్రొడక్ట్‌ & సర్వీసు రూ.6.07 LPA, నాన్-టెక్ సెక్టార్‌ రూ.6.53 LPA (IT రంగాల కంటే కొంచెం ఎక్కువ) వరకు జీతాలు అందిస్తున్నాయి. క్లౌడ్ టెక్నాలజీలు BFSI, హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమల్లో వేగంగా విస్తరిస్తున్నాయి. క్లౌడ్ ప్రొఫెషనల్స్‌కి డిమాండ్‌ పెరుగుతోంది.
* టాప్‌ జాబ్‌ రోల్స్‌, జీతాలు ఇవే

– గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs)
పెనెట్రేషన్ టెస్టర్: రూ.11.8 LPA
డేటా సైంటిస్ట్: రూ.9.6 LPA
ఫుల్‌ స్టాక్ డెవలపర్: రూ.9 LPA
సాఫ్ట్‌వేర్ డెవలపర్: రూ.8.8 LPA
కస్టమర్ సక్సెస్ స్పెషలిస్ట్: రూ.8.5 LPA

– ఐటీ ప్రొడక్ట్‌ & సర్వీసులు
బిగ్ డేటా డెవలపర్: రూ.9.7 LPA
ఐటీ ఆడిటర్: రూ.8.3 LPA
ఆర్‌పీఏ బిజినెస్ అనలిస్ట్: రూ.8 LPA
క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్: రూ.7.5 LPA
ఐఓటీ ఇంజనీర్: రూ.6.9 LPA

– నాన్-టెక్ సెక్టార్స్‌
డేటా ఇంజనీర్: రూ.9.4 LPA
SAP ABAP కన్సల్టెంట్: రూ.8.2 LPA
క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్: రూ.7.5 LPA
సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్: రూ.6.9 LPA
ఆటోమేషన్ ఇంజనీర్: రూ.6 LPA
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ అంటే మల్టి నేషనల్‌ కంపెనీలు (MNCలు) తమ పేరెంట్‌ కంపెనీల కోసం, బిజినెస్‌ ఫంక్షన్‌లు మేనేజ్‌ చేయడానికి ఏర్పాటు చేసే కేంద్రాలు. ఇప్పుడు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌లు భారతదేశ ఎంట్రీ- లెవల్‌ జాబ్ మార్కెట్‌లో కీలకంగా అభివృద్ధి చెందుతున్నాయి. పెనెట్రేషన్ టెస్టర్లు, డేటా సైంటిస్ట్‌ల వంటి జాబ్స్‌కి భారీ వేతనాలు, ప్రీమియం ఆపర్చునిటీలు అందిస్తున్నాయి. GCCలు ఇప్పుడు భారతదేశంలో 1.66 మిలియన్లకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా విస్తరిస్తున్నాయి.

సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి ఫంక్షనల్ ఏరియాలు గ్రాడ్యుయేట్‌లకు పుష్కలమైన అవకాశాలను సృష్టిస్తున్నాయి. కంపెనీలు టెక్నికల్‌ నాలెడ్జ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌, అనలిటికల్‌ కేపబిలిటీస్‌ వంటి హైబ్రిడ్ స్కిల్స్‌ కలిగిన అభ్యర్థులను నియమించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి.