భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (NEP) 2020 కింద దేశ విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా స్టూడెంట్స్ కోసం APAAR ID (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ)ని ప్రవేశపెట్టింది.
ఇది విద్యార్థులకు మాత్రమే కేటాయించే 12-అంకెల యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. దీన్నే వన్ నేషన్- వన్ స్టూడెంట్ ఐడీ కార్డ్ అంటారు. ఒక స్టూడెంట్‌కు ప్రీ-ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు జీవితాంతం ఇదే నంబర్ వర్తిస్తుంది. గ్రేడ్స్, డిగ్రీలు, స్కాలర్‌షిప్స్, ఎక్స్‌ట్రాకరికులర్ యాక్టివిటీస్, ఇతర అకాడమిక్ రికార్డులు అన్నీ అపార్ ఐడీకి లింక్ అవుతాయి.
* అపార్ ఐడీ (APAAR ID) ఫీచర్లు
అపార్ ఐడీ అనేది ప్రతి విద్యార్థికి ఫిక్స్‌డ్ ఐడెంటిఫయర్‌గా పని చేస్తుంది. స్టూడెంట్స్‌కు సంబంధించిన అన్ని ఎడ్యుకేషనల్ రికార్డులను డిజిటల్‌గా స్టోర్ చేయవచ్చు, యాక్సెస్ చేయవచ్చు. దీంతో స్కూల్, కాలేజీ మారినప్పుడు సర్టిఫికెట్లు సబ్మిట్ చేయడం మరింత ఈజీ అవుతుంది.
* ఆధార్‌తో లింక్
APAAR ID, విద్యార్థి ఆధార్ నంబర్‌తో లింక్ అవుతుంది. దీంతో ఇది చాలా సెక్యూర్‌గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో పిల్లల తల్లిదండ్రుల అంగీకారం అవసరం. ఐడీ క్రియేట్ అయిన తర్వాత, స్టూడెంట్ డిజిలాకర్ (DigiLocker) అకౌంట్‌లో అపార్ స్టోర్ అవుతుంది. అన్ని అకాడమిక్ డాక్యుమెంట్స్ ఆన్‌లైన్‌లో సేఫ్‌గా అందుబాటులో ఉంటాయి.
* APAAR ID కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
విద్యార్థుల APAAR ID రిజిస్ట్రేషన్ కోసం స్కూల్స్ ముందుగా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తీసుకోవాలి. తర్వాత DigiLocker వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి లేదా యాప్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పుడు మొబైల్ నంబర్, ఆధార్ వివరాలతో సైన్ అప్ చేయాలి. ఆధార్‌ను లింక్ చేసి, e-KYC ప్రాసెస్ పూర్తి చేయాలి. తర్వాత మీ డిజిలాకర్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. దీంట్లో అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ విభాగానికి వెళ్లి.. స్కూల్ లేదా యూనివర్సిటీ పేరు, కోర్సు వివరాలు, అకడమిక్ డీటైల్స్ ఎంటర్ చేయాలి. అన్ని వివరాలు నింపి ఫారమ్ సబ్మిట్ చేస్తే, స్టూడెంట్ APAAR ID జనరేట్ అవుతుంది.
* ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ముందుగా డిజిలాకర్‌కి లాగిన్ అవ్వాలి. డాష్‌బోర్డ్‌లోని APAAR ID ఆప్షన్‌లో మీ అపార్ కార్డ్ కనిపిస్తుంది, దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు. అన్ని అకడమిక్ పర్పస్‌లకు ఈ 12 అంకెల యూనిక్ అపార్ ఐడీ నంబర్ ఉపయోగించవచ్చు.
* బెనిఫిట్స్ ఇవే
అపార్ ఐడీతో స్టూడెంట్ అకడమిక్ క్రెడిట్స్ ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడం, స్టూడెంట్స్ ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ మరింత ఈజీ అవుతుంది. అన్ని అకడమిక్ రికార్డులను సెంట్రల్‌గా స్టోర్ చేయడంతో, రికార్డులను ఈజీగా వెరిఫై చేయవచ్చు, మోసాలకు చెక్ పెట్టవచ్చు. APAAR ID స్టూడెంట్ అకడమిక్ రికార్డులను ట్రాక్ చేయడమే కాకుండా కో-కరికులర్ యాక్టివిటీలను కూడా మెయింటెన్ చేస్తుంది.