తమిళ అగ్ర కథానాయకుడు శివ కార్తికేయన్, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ అమరన్. ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించాడు.
దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. శివ కార్తికేయన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్‌లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది.
ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 05 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటించగా.. కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు.