UGC కొత్త రూల్స్.. ఇక రెండేళ్ళకే డిగ్రీ పూర్తి చెయ్యొచ్చు

www.mannamweb.com


అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల డిగ్రీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. యూజీ స్టూడెంట్స్ కి త్వరలో డిగ్రీ కోర్సుల డ్యురేషన్ ని తగ్గించుకునే, పొడిగించుకునే ఆప్షన్​ రానుందని చెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. స్టూడెంట్స్ కి తమ డిగ్రీల డ్యురేషన్ ని వారు చదివే సామర్ధ్యం ఆధారంగా తగ్గించడం లేదా పొడిగించే విధంగా ఉన్నత విద్యా సంస్థలు త్వరలో ఒక ఆప్షన్​ను తీసుకురానున్నట్లుగా చెప్పారు.అంటే మనలో చాలా మంది కూడా త్వరగా చదవాలనుకునే వారు ఉంటారు. అయితే ఇక యాక్సిలరేటెడ్ అనే డిగ్రీ ప్రోగ్రామ్‌తో రెండేళ్లలో కూడా డిగ్రీ పూర్తిచేయవచ్చు. అలాగే ఎక్స్‌టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ పేరుతో నాలుగేళ్లలో కూడా డిగ్రీ కోర్సును పూర్తి చేసే ఛాన్స్ ఉందట. అయితే చాలా మందికి కూడా ఈ డిగ్రీ సర్టిఫికేట్‌తో ఉద్యోగాలు వస్తాయా రావా అన్న సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సర్టిఫికెట్ తో అన్ని రకాల ఉద్యోగాలకు అప్లై చేయవచ్చని, సాధారణ డిగ్రీకి ఉన్న విలువే దీనికి కూడా ఉంటుందని యూజిసి ఛైర్మన్ జగదీశ్ తెలిపారు. ఈ డిగ్రీ కోర్సును మీ సామర్థ్యాన్ని బట్టి పూర్తి చేసుకోవచ్చు.

విద్యార్థులు మొదటి లేదా రెండో సెమిస్టర్ చివరలో ఏడీపీని ఎంచుకునే అవకాశం ఉంటుందని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. మొదటి లేదా రెండో సెమిస్టర్ చివరిలో ఏడీపీని సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఆ తర్వాత సెలెక్ట్ చేసుకోవడానికి కుదరట. ఫస్ట్ సెమిస్టర్‌ తర్వాత ఏడీపీలో చేరితే రెండో సెమిస్టర్ నుంచి ఈ కండిషన్ అప్లై అవుతుంది. అంటే మీరు ఏ సెమిస్టర్‌లో తీసుకుంటే ఆ తర్వాత సెమిస్టర్‌కి ఇది అప్లై అవుతుంది. ఈ విధంగా మీరు డిగ్రీ కోర్సును పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అయితే ఏడీపీని సెలెక్ట్ చేసుకునే విద్యార్థులు ప్రతి సెమిస్టర్‌లో ఎక్స్ట్రా క్రెడిట్‌లను పొందాలి.

అంటే విద్యార్థులు ఫస్ట్ సెమిస్టర్ తర్వాత ఏడీపీలో చేరినట్లయితే, రెండో సెమిస్టర్ నుంచి ఎక్స్ట్రా క్రెడిట్స్​ను సాధించాలి. రెండో సెమిస్టర్ తర్వాత ఏడీపీలో చేరినట్లయితే, మూడో సెమిస్టర్ నుంచి ఎక్స్ట్రా క్రెడిట్​ను సాధించాల్సి ఉంటుంది. 3 లేదా 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్​లో కోర్సును మాక్సిమం రెండు సెమిస్టర్ల వరకు పొడిగించుకోవచ్చు. కాలేజీలు డిగ్రీ ప్రోగ్రామ్ పూర్తి చేసిన స్టూడెంట్స్​కు వెంటనే డిగ్రీలు అందించవచ్చని యూజీసీ చీఫ్ తెలిపారు. డిగ్రీ సర్టిఫికెట్ కోసం కోర్సు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అయిది వీటి కోసం విద్యార్థి స్వీయ నియంత్రిత అంటే సెల్ఫ్ కంట్రోల్ నోటు రాయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.