శ్రీ హనుమాన్ ఆలయంలో అద్భుతం.. తరించిన భక్తజనం.. ఆ లీల ఏమిటంటే

www.mannamweb.com


ఆ హనుమంతుడు స్వయంగా ఆ ఆలయానికి వచ్చేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో శరణు శరణు అంటూ.. మొక్కారు. అక్షరాలా 30 నిమిషాలు అలాగే ఉండిపోగా..

శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం దండకాన్ని భక్తులు పఠించారు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కానీ, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.

శ్రీరామ భక్తుడు హనుమాన్ లీలలు చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. అటువంటి హనుమంతుడి రూపమే వానరం. వానరాలు ఎక్కడైనా కనిపించినా హనుమంతుడి సాక్షాత్కారంగా భావిస్తాం. అలాగే ఎందరో భక్తులు అడవులకు వెళ్లి, వానరాలకు ఆహారాన్ని అందిస్తుంటారు. అలా ఆహారాన్ని అందించడం మహా పుణ్యకార్యంగా భావిస్తారు భక్తులు. ఆ వానరాలు సైతం భక్తుల జోలికి వెళ్లకుండా, తెచ్చిన ఆహారాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోతాయి. అంతేకాదు ఎక్కడైనా వానరం పరమపదం చెందితే, పలువురు భక్తులు అంత్యక్రియలు సైతం నిర్వహిస్తారు. అలా భక్తి ప్రపంచంలో వానరాలకు ప్రాముఖ్యత ఉంది.

ఈ తరుణంలో ఓ హనుమంతుడి ఆలయంలోకి హఠాత్తుగా వానరం ప్రవేశించింది. అలా ప్రవేశించిన వానరం, భక్తులను దాటుకుంటూ నేరుగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు చేరింది. అంతేకాదు స్వామి వారి ఆయుధంగా చెప్పుకొనే గధను చేతిలో పట్టుకుంది. అది కూడా శ్రీ వీరాంజనేయ స్వామి ఏవిధంగా తన భుజంపై గధను ధరిస్తారో, అదేరీతిలో పట్టుకొని అలాగే ఉండిపోయింది. భక్తులు మాత్రం ఆలయం నిండా ఉన్నారట ఆ సమయాన. కానీ వానరం మాత్రం కొంచెం కూడా జంకు లేకుండా గధను పట్టుకొని అలాగే ఉండిపోయింది.

ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం అంటూ స్వామి వారి నామాన్ని జపించారు. ఈ జపం సాగుతున్నంత సేపు వానరం కూడా గద పట్టుకొని, అలా ఇలా ఊగుతూ ఉండిపోయింది. ఇక భక్తుల భక్తితత్వానికి హద్దులు లేకుండా పోయింది. నేరుగా శ్రీ ఆంజనేయుడు తమను దీవించేందుకు వచ్చారని, స్వామీ శరణు శరణు అంటూ.. తమ కోరికలను విన్నవించుకున్నారు.

ఇలా ఆంజనేయ స్వామి ఆలయానికి వానరం రావడం సాధారణమే అయినప్పటికీ, వచ్చిన వానరం గధను ధరించి అలాగే ఉండిపోవడంతో పలువురు భక్తులు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఖచ్చితంగా శ్రీ అంజనేయుడి మహిమేనంటూ భక్తులు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఓ సారి ఈ దృశ్యాన్ని చూసి తరించండి.