అదృష్టవంతులైన వారు ఏ నెలలో పుడతారు.

www.mannamweb.com


కొంతమంది పుట్టగానే వారిని అదృష్టం వరిస్తుంది. అలాగే కొందరు పేదరికంలోనే పుడతారు. కానీ తరువాత డబ్బు సంపాదిస్తారు. ఇక కొందరు డబ్బులో పుట్టినా తరువాత దాన్ని పోగొట్టుకోవచ్చు.

విధి అనేది ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలాగా ఉంటుంది. అయితే మనం ఈ జన్మలో అనుభవించేదంతా క్రితం జన్మలో చేసిన పాపమో లేదా పుణ్య ఫలమో అయి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. క్రితం జన్మలో పాపం చేస్తే ఈ జన్మలో అన్నీ కష్టాలనే అనుభవిస్తామట. అలాగే పూర్వ జన్మలో ఏదైనా పుణ్యం చేసినా.. మంచి పనులు చేసినా.. అందుకు తగిన ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తామట. అందుకనే కొందరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏం చేసినా కలసి వస్తుంది. మిక్కిలిగా ధనం సంపాదిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

ఇక మనం జన్మించే నెలను బట్టి కూడా మన జీవిత ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ నెలలో పుట్టిన వారు ఏం చేస్తారో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో, డబ్బు సంపాదిస్తారో లేదో.. ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి నెలలో పుట్టిన వారు సున్నితమైన మనసును కలిగి ఉంటారట. వీరికి తెలివి తేటలు అధికంగా ఉంటాయట. ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు చదువుల్లో ప్రతిభను కనబరుస్తారట. తెలివితేటలను కలిగి ఉండడంతోపాటు కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారట.

మార్చి నెలలో పుట్టిన వారు కాస్త గర్వం కలిగి ఉంటారట. రాజకీయాల్లో రాణిస్తారట. వీరు ఆలోచనా శక్తిని కలిగి ఉంటారట. ఏప్రిల్‌ నెలలో పుడితే వారికి కోపం అధికంగా ఉంటుంది. కానీ చురుగ్గా ఉంటారు. తెలివితేటలు, ధైర్యం కలిగి ఉంటారు. మే నెలలో పుట్టిన వారు ఎక్కువగా ప్రయాణాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తారు. త్యాగబుద్ధి ఉంటుంది. ఓర్పుగా ఉంటారు. జూన్‌ నెలలో పుట్టిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. పదునైన మెదడు ఉంటుంది. కానీ తొందరపాటు ఎక్కువ. ఏ విషయంలో అయినా చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటారు.

జూలైలో పుట్టిన వారు పారిశ్రామిక వేత్తలుగా మారుతారు. వీరికి అదృష్టం ఎక్కువే. ఆగస్టులో పుట్టిన వారు తమ స్వయం శక్తితో ఎదుగుతారు. సమాజంలో గౌరవం ఉంటుంది. సమయస్ఫూర్తితో రాణిస్తారు. సెప్టెంబర్‌లో పుట్టిన వారు చురుగ్గా ఉంటారు. కానీ తొందరపాటు ఉంటుంది. తమ శ్రమను నమ్ముకుంటారు. అక్టోబర్‌లో జన్మించిన వారు శక్తివంతులుగా మారుతారు. వీరు అందరినీ ఆకర్షిస్తారు. నవంబర్‌లో పుట్టిన వారు పోరాడే గుణాన్ని కలిగి ఉంటారు. ధైర్యం ఎక్కువే. కోరికలు కూడా ఎక్కువే. చురుగ్గా ఉంటారు. డిసెంబర్‌లో పుట్టిన వారు ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటారు. ఇతరుల పట్ల ప్రేమను చూపిస్తారు. జాలి, దయ కలిగి ఉంటారు.