నన్ను అత్త అని ఏ రోజూ పిలవలేదు .. నాగచైతన్య గురించి బయటపడ్డ సంచలన విషయం

www.mannamweb.com


అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ వివాహం నేపథ్యంలో చైతూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఆయన గురించిన చిన్న వార్త కూడా వైరల్ అయి కూర్చొంటోంది.

మరో రెండ్రోజుల్లో వీరిద్దరి పెళ్లి హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఇందుకోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సోదరి నాగ సుశీల పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా దిగ్గజం దివంగత అక్కినేని నాగేశ్వరరావు – అన్నపూర్ణ దంపతులకు ఐదుగురు సంతానం. వీరే అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట్, నాగ సుశీల, సత్యవతి అక్కినేని, సరోజ అక్కినేని. అయితే వీరందరికీ నాగ అన్న పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అందరికీ ఒక డౌట్. దీని వెనుక ఓ ఆసక్తికర ఘటనను నాగార్జున ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాగేశ్వరరావు కడుపులో ఉన్నప్పుడు నానమ్మకు నాగుపాము ప్రతిరోజూ కలలో కనిపించడంతో పాటు , నాన్నకి పాలు ఇస్తుండగా ఓ రోజున నాగుపాము పిల్ల కనిపించిందట

దీంతో నాన్నకి నాగేశ్వరరావు అని పెట్టారని.. ఆ తర్వాత నాకు, నాగ సుశీల అని కంటిన్యూ చేశారని నాగార్జున వెల్లడించారు. ఇక చైతూ పుట్టిన తర్వాత కేవలం చైతన్య అని మాత్రమే పేరు పెట్టామని.. దీంతో మా అమ్మ నాగ అని ముందు చేర్చామని చెప్పడంతో నాగ చైతన్య అయ్యిందని నాగ్ తెలిపారు. ఇక ఐదుగురు తోబుట్టువులలో నాగసుశీలతో నాగార్జునకు అనుబంధం ఎక్కువ. ఐదుగురిలో చిన్నవాడు కావడంతో నాగ్‌ను చిన్నప్పటి నుంచి ఆమె చినాబు అని పిలుస్తుంటారు. ప్రతి ఏడాది ఎక్కడున్నా రక్షాబంధన్ రోజు మాత్రం తమ్ముడిని కలిసి రాఖీ కట్టాల్సిందే.

పెళ్లయ్యాక భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు నాగసుశీల. ఆ సమయంలో నాగార్జున అక్కడే మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు. పరాయి దేశంలో ఉండటంతో అక్కతో ఆయనకు అనుబంధం మరింత పెరిగింది. ఆదివారం ఖచ్చితంగా అక్క దగ్గరికి వెళ్లి ఆమె చేతి వంట తినాల్సిందే. ఇప్పుడు పెద్ద స్టార్ హీరో.. సినిమాలు, షూటింగ్స్, షోలు, వ్యాపారాలతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నా కానీ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తాడని తమ్ముడిపై ప్రశంసల వర్షం కురిపించారు నాగసుశీల.

ఇదిలాఉండగా.. ఇంట్లో తన తోబుట్టువులతో పాటు వారి పిల్లలు, వారి స్నేహితులు అంతా తనను అత్త అనో, పిన్ని అనో కాకుండా సుశీలమ్మ అని పిలుస్తారని నాగ సుశీల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సుశీలమ్మ అన్న పిలుపులో ఎంతో అప్యాయత, ప్రేమ కనిపిస్తాయని అదే తనకు కూడా ఇష్టమని ఆమె అన్నారు. నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన ఉంగరం తానే తీసుకున్నానని.. అది పెట్టినప్పటి నుంచి నేను ఆయనలానే మాట్లాడుతున్నానని చెబుతున్నారని సుశీల చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.